మెదక్ : మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కూకట్లపల్లి గ్రామంలో మంగళవారం ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లిన ఓ మహిళపై అడవి పంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గ్రామానికి చెందిన చింతల అంజమ్మ తోటి కూలీలతో కలిసి ఉపాధి హామీ పనుల నిమిత్తం అడవిలోకి వెళ్లగా, అకస్మాత్తుగా ఎదురైన అడవి పంది ఆమెపై దాడి చేసింది.
ఈ ఘటనలో అంజమ్మ రెండు చేతులు, కుడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. దాడిని గమనించిన తోటి కూలీలు వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రస్తుతం ఆమెకు వైద్య చికిత్స అందిస్తున్నారు.