BSP MLA: బహుజన్ సమాజ్ పార్టీ ఏకైక ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ మృతి
BSP MLA: ఉత్తరప్రదేశ్‌లోని బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే ఉమాశంకర్ సింగ్ మృతిచెందారు. రస్దా నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. యూపీ అసెంబ్లీ సామర్థ్యం 403 సీట్లు కాగా, దాంట్లో ఉమాశంకర్ ఒక్కరే బీఎస్పీ పార్టీకి చెందినవారు.
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే(BSP MLA) ఉమాశంకర్ సింగ్ మృతిచెందారు. రస్దా నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. యూపీ అసెంబ్లీ సామర్థ్యం 403 కాగా, దాంట్లో ఉమాశంకర్ ఒక్కరే బీఎస్పీ పార్టీకి చెందినవారు. బ్రెయిన్ ట్యూమర్‌కు ఆయన చికిత్స తీసుకుంటున్నట్లు తెలిసింది. ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం రాత్రి 8.30 నిమిషాలకు ఆయన ప్రాణాలు విడిచినట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఉమాశంకర్ మృతి పట్ల సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. బీఎస్పీ ప్రెసిడెంట్ మాయావతి కూడా ఎమ్మెల్యే మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. చికిత్స సమయంలో ఆయన కుమారుడితో నిత్యం టచ్‌లో ఉన్నట్లు ఆమె తెలిపారు. స్టూడెంట్ నేతగా తన ప్రజాజీవితాన్ని ఉమాశంకర్ మొదలుపెట్టాడు. బలియాలో ఉన్న సతీశ్ చంద్ర కాలేజీలో ఆయన స్టూడెంట్ యూనియన్ జనరల్ సెక్రటరీగా చేశారు. యూపీ అసెంబ్లీలోని రస్దా నియోజకవర్గం నుంచి 2012లో ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2017, 2022 సంవత్సరాల్లోనూ ఆ స్థానాన్ని ఆయన చేజిక్కించుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

