Padma Devender Reddy | మెదక్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అస్తతత్వంపై దాడి చేసేందుకు ఆంధ్ర పాలకులు పార్టీల పేరుతో కుట్ర చేస్తున్నారని మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం మెదక్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసి అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆంధ్ర పాలకులు పార్టీల పేరుతో తెలంగాణ వనరులు దోపిడీ చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, కుట్రదారులకు తెలంగాణ పాలకులు మద్దతు పలుకుతున్నారని తెలిపారు. తెలంగాణ వ్యతిరేకులు అంతా ఒక్కటై మరోసారి రాష్ట్ర వనరులు దోపిడీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న తెలంగాణను కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి , మాజీ మున్సిపల్ చైర్మన్ బట్టి జగపతి,, పట్టణ పార్టీ కన్వీనర్ ఆంజనేయులు గౌడ్, నాయకులు లావణ్య రెడ్డి, సుభద్ర రావు తదితరులు పాల్గొన్నారు.
Priyanka Mohan | ‘మేడ్ ఇన్ కొరియా’ సక్సెస్ ఎఫెక్ట్.. కొరియా టూరిజం అంబాసిడర్గా ప్రియాంకా మోహన్!
Pawan kalyan | పవన్ కల్యాణ్ సభకు అనుమతి నిరాకరించిన హైకోర్టు