నేడే రెండో విడత.. 89 స్థానాలకు పోలింగ్
లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ శుక్రవారం జరగనుంది. 13 రాష్ర్టాల్లోని 89 లోక్‌సభ స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరుగుతాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ సహా కేరళలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాలకు ఇదే విడతలో పోలింగ్ జరగనుంది.
- పోటీలో 1,206 మంది
- బరిలో రాహుల్, కుమారస్వామి, థరూర్, రాజీవ్ చంద్రశేఖర్, హేమామాలిని, ఓం బిర్లా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: లోక్‌సభ ఎన్నికల రెండో విడత పోలింగ్ శుక్రవారం జరగనుంది. 13 రాష్ర్టాల్లోని 89 లోక్‌సభ స్థానాలకు ఈ విడతలో ఎన్నికలు జరుగుతాయి. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వయనాడ్ సహా కేరళలోని మొత్తం 20 లోక్‌సభ స్థానాలకు ఇదే విడతలో పోలింగ్ జరగనుంది. కర్ణాటకలోని 28 స్థానాల్లో 14 స్థానాలకు, రాజస్థాన్‌లో 8 సీట్లు, ఉత్తరప్రదేశ్‌లో 8, మధ్యప్రదేశ్‌లో 7, అస్సాంలో 5, బీహార్‌లో 5, ఛత్తీస్‌గఢ్‌లో 3, పశ్చిమ బెంగాల్లో 3 స్థానాలకు, మణిపూర్, త్రిపుర, జమ్ము కశ్మీర్లో ఒక్కొక్క స్థానానికి ఈ విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
మొత్తం 1,206 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ నేతలు శశి థరూర్, కేసీ వేణుగోపాల్, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్, అరుణ్ గోవిల్(రామాయణం సీరియల్ రాముడి పాత్రధారి), కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేశ్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి, నటి హేమమాలిని, స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తదితర ప్రముఖులు ఈ విడతలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రెండో విడత పోలింగ్‌తో కేరళ, రాజస్థాన్, త్రిపురలోని అన్ని స్థానాలకు పోలింగ్ పూర్తవుతుంది. ఇప్పటికే ఏప్రిల్ 19న జరిగిన మొదటి విడతలో తమిళనాడు, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, అండమాన్, నికోబార్ దీవులు, మిజోరం, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కిం, లక్షద్వీప్‌లో అన్ని స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

