సోమవారం 18 జనవరి 2021
National - Nov 29, 2020 , 16:00:07

క్యాబినెట్‌ విస్తరణకు మరికొంత సమయం : సీఎం యెడియూరప్ప

క్యాబినెట్‌ విస్తరణకు మరికొంత సమయం : సీఎం యెడియూరప్ప

బెంగళూర్‌ : కర్ణాటక క్యాబినెట్‌ పునఃవ్యవస్థీరణ, విస్తరణకు మరికొంత సమయం పట్టే అవకాశముందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్‌ యెడియూరప్ప సంకేతాలిచ్చారు. ఆదివారం చిత్రదుర్గలోని తన అధికారం నివాసం కావేరి నుంచి బయల్దేరిన ఆయన స్థానికంగా.. శివమొగ్గ జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్యాబినెట్‌ విస్తరణకోసం మరికొంతకాలం ఎదురు చూడాల్సి రావచ్చని, ఈ విషయంపై అధిష్ఠానం నుంచి ఇంతవరకు ఎలాంటి అనుమతి రాలేదని యెడియూరప్ప పేర్కొన్నారు.

ఇటీవల ఆయన రెండుసార్లు ఢిల్లీ వెళ్లి క్యాబినెట్‌ విస్తరణపై బీజేపీ అధిష్ఠానంతో చర్చించారు. అయినా ఇంతవరకు అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ ఎమ్మెల్యేలతోపాటు ప్రభుత్వ ఏర్పాటు సమయంలో ఇతరపార్టీల నుంచి వచ్చిన వారు క్యాబినెట్‌ విస్తరణకోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. గత శుక్రవారం సీఎం యెడియూరప్ప మరో మూడురోజుల్లో క్యాబినెట్‌ విస్తరణ ఉంటుందని చెప్పడంతో ఆశావహుల్లో ఆనందం కనిపించింది. మరికొంత సమయం ఆగాలని సీఎం సంకేతాలివ్వడంతో వారిలో నైరాశ్యం నెలకొంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.