నటించను.. ఇలాగేవుంటా.. నీకేమైనా ఇబ్బందా?
నటి మాళవిక మోహనన్‌కి కోపం వచ్చింది. ఈ ముద్దుగుమ్మకు ఖాళీ సమయంలో అభిమానులతో ముచ్చటించడం సరదా. ఈ కారణంగానే తన ఎక్స్(ట్విటర్)లో ‘ఆస్క్ మాళవిక’ పేరుతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది.
నటి మాళవిక మోహనన్‌కి కోపం వచ్చింది. ఈ ముద్దుగుమ్మకు ఖాళీ సమయంలో అభిమానులతో ముచ్చటించడం సరదా. ఈ కారణంగానే తన ఎక్స్(ట్విటర్)లో ‘ఆస్క్ మాళవిక’ పేరుతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. మరి ప్రశ్నించేవారంతా బుద్ధిమంతులు కారుకదా.. వారిలో ఓ తుంటరి నెటిజన్ తన ప్రశ్నతో మాళవికను అసహనానికి లోను చేశాడు. ‘ఎప్పుడూ గ్లామర్ షోనేనా? నటించడం ఏమైనా ఉందా?’ అని అడగడంతో ఈ ముద్దుగుమ్మకు మండుకొచ్చింది.
‘నేను నటించను.. ఇలాగే ఉంటాను.. నీకేమైనా ఇబ్బందా?’ అంటూ ఆవేశంగా బదులిచ్చింది. దీంతో మిగతా వారంతా మాళవికను శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ‘అలాంటివారికి సమాధానం చెప్పకండి?’ అని ఒకరు.. ‘బాధపడకండి మేడమ్..’ అంటూ ఒకరు మాళవికను ఓదార్చారు. ఈ సెషన్లో మాళవిక చాలా ప్రశ్నలకు సమాధానాలిచ్చింది.
రజనీకాంత్ ‘తంగలాన్’లో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నాననీ, ప్రేక్షకుల స్పందన కోసం ఎదురు చూస్తున్నానని మాళవిక చెప్పింది. హైదరాబాద్ ఫుడ్ అంటే తనకు ఇష్టమని, అనుష్కశెట్టి, సమంత తనకు ఇష్టమైన హీరోయిన్లనీ, తన తొలి సెలబ్రిటీ క్రష్ హృతిక్ రోషన్ అని ఈ ఇంటర్వ్యూలో తెలిపింది మాళవిక.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

