Saurabh Bharadwaj : ఢిల్లీ (Delhi) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఘోర పరాజయాన్ని చవిచూసింది. అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal), మనీష్ సిసోడియా (Manish Sisodia), సౌరభ్ భరద్వాజ్ (Saurab Bharadwaj) తదితర సీనియర్ నేతలు అందరూ ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో సౌరభ్ భరద్వాజ్ ఆప్ కార్యకర్తల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినందుకు బాధపడాల్సిన అవసరం లేదని చెప్పారు.
మహా సంగ్రామంలో గెలుపునకే చిన్నచిన్న యుద్ధాల్లో ఓటములు ఎదురవుతాయని సౌరభ్ భరద్వాజ్ వ్యాఖ్యానించారు. ఇప్పటిదాకా ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన భరద్వాజ్ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి షిఖా రాయ్ చేతిలో 3 వేల పైచిలుకు ఓట్ల తేడాతో పరాజయం మూటగట్టుకున్నారు. ఈ సందర్భంగా ఓ జాతీయ మీడియా సంస్థతో ఆయన మాట్లాడారు.
ఎన్నికల్లో తన గెలుపు కోసం కృషిచేసిన ఆప్ కార్యకర్తలు, వాలంటీర్లు, దాతలు ఎవరూ ఆందోళన చెందవద్దని సౌరభ్ భరద్వాజ్ చెప్పారు. ఒక ఎమ్మెల్యేగా గ్రేటర్ కైలాష్ నియోజకవర్గంలో తాను చేయాల్సిన అభివృద్ధి చేశానని తెలిపారు. ఈ విషయం ఈ ఏరియాకు చెందిన పాత్రికేయులు, సామాన్యులకు తెలుసని అన్నారు.
Parvesh Verma | ఢిల్లీలో జరిగిన అవినీతిపై సిట్ వేస్తాం.. కేజ్రివాల్పై గెలిచిన పర్వేష్ వర్మ వెల్లడి
Arvind Kejriwal | ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం.. బీజేపీకి అభినందనలు : అర్వింద్ కేజ్రీవాల్
Delhi Elections | సీఎం అతిషి విజయం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ పరాజయం
Delhi Elections | ఘోర పరాజయం పాలైన ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్
Delhli Elections | జంగ్పురా నియోజకవర్గంలో అనూహ్య ఫలితం.. ఆప్ నేత మనీశ్ సిసోడియా ఓటమి