చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతున్నది. అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్ష డీఎంకే నేతలతోపాటు రాష్ట్రంలో చిన్నవైన కాంగ్రెస్, డీఎండీకే, ఎంఎన్ఎం తదితర పార్టీల నేతలు కూడా జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకోవడం కోసం వినూత్న పంథాలో తమ ప్రచారాలను కొనసాగిస్తున్నారు. ఒకరు దోసెలు వేస్తూ, మరొకరు డ్యాన్స్‌లు చేస్తూ, ఇంకొకరు కొబ్బరి బోండాలు కొడుతూ ఇలా ఎవరి తోచిన రీతిలో వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు.
తాజాగా అన్నాడీఎంకే ముఖ్య నాయకుడు, తమిళనాడు రాష్ట్ర మంత్రి ఆర్ కామరాజ్ కూడా వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. నన్నిలం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా బరిలో దిగిన ఆయన మంగళవారం ఉదయం పొలాల్లో వరినాట్లు వేస్తున్న మహిళలను ఓట్లడిగేందుకు వెళ్లారు. అక్కడ వారితో కలిసి కాసేపు సరదాగా నాటు వేశారు. నియోజకవర్గం నుంచి తనను మరోసారి గెలిపించాలని అక్కడి మహిళలను కోరారు.
Tamil Nadu: R Kamaraj, state Minister and AIADMK candidate from Nannilam sows paddy, as a part of his election campaign. pic.twitter.com/iFPCry6M0r
— ANI (@ANI) March 30, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
మోదీ సభకు వెళ్తుండగా ప్రమాదం.. తమిళనాడు స్పీకర్‌కు గాయాలు
ఆ ఆరు రాష్ట్రాల్లోనే అధికంగా కొత్త కేసులు: కేంద్రం
మమతాబెనర్జికి ఓటమి భయం పట్టుకుంది: కేంద్ర మంత్రి
ఆక్సిజన్ పైప్‌తో ఉరేసుకుని కొవిడ్ బాధితుడి ఆత్మహత్య
ఉగ్రవాదుల దాడిలో గాయపడ్డ కౌన్సిలర్ మృతి
పున్నమి చంద్రుడే ఆ నౌకను కదిలించాడు.. !
ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్
భారత మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు కరోనా పాజిటివ్