చెన్నై: తమిళనాడులో ప్రధాని నరేంద్రమోదీ ప్రచారసభకు హాజరయ్యేందుకు వెళ్తుండగా ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్, అన్నాడీఎంకే నేత పీ ధనపాల్ ప్రమాదానికి గురయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా కారును వెనుక నుంచి వస్తున్న మరో వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పీకర్ ధనపాల్కు గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఉదయం ధారాపురంలోని సూరియనల్లూర్ టోల్ గేట్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో స్పీకర్ ధనపాల్‌తోపాటు ఆ రాష్ట్ర మంత్రి ఎస్పీ వేలుమణి కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ఆ ఆరు రాష్ట్రాల్లోనే అధికంగా కొత్త కేసులు: కేంద్రం
మమతాబెనర్జికి ఓటమి భయం పట్టుకుంది: కేంద్ర మంత్రి
ఆక్సిజన్ పైప్‌తో ఉరేసుకుని కొవిడ్ బాధితుడి ఆత్మహత్య
ఉగ్రవాదుల దాడిలో గాయపడ్డ కౌన్సిలర్ మృతి
పున్నమి చంద్రుడే ఆ నౌకను కదిలించాడు.. !
ఫరూక్ అబ్దుల్లాకు కరోనా పాజిటివ్
భారత మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు కరోనా పాజిటివ్