PM Modi : దేశ ప్రజలు వరుసగా నాలుగోసారి తనను ఆశీర్వదించారని, అందుకు తాను దేశ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. ‘వికసిత్ భారత్ (Vikasith Bharat)’ తమ లక్ష్యమని, పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారని ఆయన చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభ (Lok Sabha) లో ప్రధాని మోదీ మాట్లాడారు.
ప్రజలు తనకు రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడేందుకు 14 సార్లు అవకాశం ఇచ్చారని, అందుకు వారందరికీ తాను ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ప్రధాని చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగం వికసిత్ భారత్ సంకల్పాన్ని బలోపేతం చేస్తోందని, ప్రజలకు కొత్త ఆశను ఇస్తోందని, స్ఫూర్తిగా నిలుస్తోందని ప్రధాని పేర్కొన్నారు. తాము నకిలీ నినాదాలు ఇవ్వలేదని, ప్రజలకు నిజమైన అభివృద్ధిని అందించామని వెల్లడించారు.
పేదల గుడిసెల్లో ఫొటోలకు ఫోజులిచ్చే వారికి పార్లమెంటులో పేదల గురించి మాట్లాడితే వినడం బోరింగ్‌గానే ఉంటుందని ప్రధాని పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.
Maha Kumbh | మహా కుంభమేళాలో భూటాన్ రాజు.. యూపీ సీఎంతో కలిసి పుణ్య స్నానాలు
Delhi Elections | రేపే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. సర్వం సిద్ధం చేసిన ఈసీ
BRS Whips | బీఆర్ఎస్ పార్టీ విప్‌లుగా సత్యవతి రాథోడ్, కేపీ వివేకానంద్
MLA Prashant Reddy | అసెంబ్లీని వాయిదా వేయడం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం
MLA Talsani | ఇంతటి బాధ్యతారాహిత్య ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు : ఎమ్మెల్యే తలసాని
Harish Rao | ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు?.. అసెంబ్లీ వాయిదాపై హరీశ్‌రావు ఆగ్రహం