న్యూఢిల్లీ: యూరప్‌తోపాటు ఇతర దేశాల్లోని ప్రభుత్వాలు నిషేధించిన కంటెంట్‌తో ఓ ఆన్లైన్ పోర్టల్‌ను ప్రారంభించడానికి అమెరికా సన్నాహాలు చేస్తున్నది. ఫ్రీడమ్.గవ్ పేరిట ఈ పోర్టల్‌ను అమెరికా విదేశాంగ శాఖ ప్రారంభించనున్నది. ఈ పోర్టల్ ఓ వీపీఎన్(వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్) ఫంక్షన్‌ను కూడా పొందుపరుచుకుంటుంది.
ఇది వెబ్సైట్ ట్రాఫిక్ సోర్స్ అమెరికా నుండే జనరేట్ అయినట్లు కనిపించేలా చేస్తుంది. పోర్టల్ యూజర్ యాక్టివిటీని ట్రాక్ చేయదని కూడా వర్గాలు పేర్కొన్నాయి. డిజిటల్ స్వేచ్ఛకు అమెరికా విదేశాంగ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది.