హైదరాబాద్: అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే వాయిదా వేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా వేయటం ఏమిటని ప్రశ్నించారు. క్యాబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతున్నదని, సబ్జెక్టు నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు, ఇప్పుడు పాలక పక్షంలో ఉన్న ప్రిపేర్ కాలేదని ఎద్దేశా చేశారు. ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
అసెంబ్లీ ప్రత్యేక సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. అయితే మంత్రి మండలి సమావేశం ఇంకా ముగియలేదని, మినిట్స్ ప్రిపేర్ చేయడానికి సమయం పడుతుందని, అందువల్ల సభను వాయిదా వేయాలంటూ మంత్రి శ్రీధర్‌బాబు స్పీకర్‌ను కోరారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదావేశారు.
అసెంబ్లీ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా వేయటం ఏమిటి?
క్యాబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతున్నదని, సబ్జెక్టు నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్ బాబు గారు కోరడం హాస్యాస్పదం.
నాడు ప్రతిపక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు,
నేడు పాలక పక్షంలో ఉన్న ప్రిపేర్ కాలేదు.…— Harish Rao Thanneeru (@BRSHarish) February 4, 2025