అమరావతి : రాష్ట్రంలోని ముఖ్యమైన అంశాలపై నిర్వహిస్తున్న అసెంబ్లీ (Assembly) సమావేశాన్ని ఒక్క నిమిషంలోనే వాయిదా వేయడం బాధ్యతారాహిత్యమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas) ఆరోపించారు. మంగళవారం మీడియా పాయింట్లో ఆయన మాట్లాడారు. సమావేశాన్ని వాయిదా వేసి శాసనసభ రూల్స్, ప్రొసిజర్స్ (Procedures) తుంగలో తొక్కారని ఆరోపించారు.
కామారెడ్డి డిక్లరేషన్ యధాతథంగా అమలు చేయడం కోసం తెలంగాణ సమాజం ఎదురు చూస్తున్నదని అన్నారు. శాసన సభ వ్యవహారాల మంత్రి అడిగిన వెంటనే స్పీకర్ సభను వాయిదా వేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ప్రాధాన్యత గల అంశాలపై నాలుగు రోజులు చర్చ లేకుండా ఒక్క రోజుల్లోనే ముగించడం ఏమిటని ప్రశ్నించారు. ఇంత బాధ్యతా రహితంగా, అన్యాయంగా, కుట్ర పూరితంగా వ్యవహరించడం తాను గతంలో ఎన్నడూ చూడలేదని వెల్డించారు.
కాంగ్రెస్ నిర్వహించిన సర్వేలో తమకు అనుమానాలు ఉన్నాయని వాటిని నివృత్తి కావాలంటే ప్రభుత్వం నాలుగు రోజుల పాటు సమావేశాలను నిర్వహించి కీలక అంశామైన బీసీ, ఎస్సీ కుల గణనపై చర్చలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కుల గణన తప్పు అని మేము అంటున్నాం. మీరు కరెక్టు అని నిరూపించుకోవాలని కోరారు. 1947 స్వతంత్ర ఉద్యమం, 1969 తెలంగాణ ఉద్యమాన్ని తాము చూడలేదు. కేసీఆర్ నడిపిన ఉద్యమాన్ని చూశాం. అన్యాయం జరిగితే బీసీల ఐక్యంతో ఇప్పుడు అతిపెద్ద ఉద్యమం మరోసారి రాబోతుందని అన్నారు.