ఢిల్లీ : ఆధునిక టెన్నిస్ ప్రపంచ సంచలనాలు కార్లొస్ అల్కరాజ్, యానిక్ సిన్నర్ (సిన్కరాజ్-అభిమానులు పిలుచుకునే పేరు) దోహాలో జరుగుతున్న ఖతార్ ఓపెన్‌లో క్వార్టర్స్ చేరుకున్నారు.
ఇటీవలే ముగిసిన ఆస్ట్రేలియా ఓపెన్‌లో టైటిల్ గెలిచిన ఊపులో ఉన్న అల్కరాజ్.. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో 6-2, 7-5తో వలెంటిన్ రోయర్ (ఫ్రాన్స్)పై గెలిచాడు. మరో పోరులో సిన్నర్.. 6-3, 7-5తో అలెక్సి పొపిరిన్ (ఆస్ట్రేలియా)పై వరుస సెట్లలో గెలిచి క్వార్టర్స్‌కు అర్హత సాధించాడు.