మన్సూరాబాద్, ఫిబ్రవరి 19: హిందూ స్వరాజ్య స్థాపన కోసం పాటు పడిన ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్, జడ్జెస్కాలనీ ఫేజ్-1లోని శివాజీ పార్కు లో గురువారం నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలకు ఆయ న హాజరయ్యారు. భారీ ఊరేగింపుగా ఎమ్మెల్యే వచ్చి ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా హిత పరిపాలనకు ఆదర్శప్రాయుడైన మహావీరుడు ఛత్రపతి శివాజీ ప్రతిఒక్కరికీ స్ఫూర్తి ప్రధాత అన్నారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ డివిజన్ మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్‌రెడ్డి, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, జడ్జెస్ కాలనీ ఫేజ్-1 అధ్యక్షుడు బాలగోని అంజయ్య గౌడ్, ఉపాధ్యక్షుడు కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి బ్రహ్మయ్య, కోశాధికారి సిలివేరు గాలయ్య, భాస్కర్, వాసు కే యాదవ్, బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు పోచబోయిన జగదీశ్‌యాదవ్, నాయకులు జక్కిడి రఘువీర్ రెడ్డి, విజయ భాస్కర్ రెడ్డి, బాలరాజు గౌడ్, కంచర్ల రాకేశ్ రెడ్డి పాల్గొన్నారు.
జడ్జెస్ కాలనీ ఆధ్వర్యంలో ఛత్రప తి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలకు ఎమ్మె ల్యే హాజరై.. శివాజీ చిత్రపటానికి పూలమా లలు వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్, ఉపాధ్యక్షులు ఆర్. గోపినాథ్, జి. గోవింద రెడ్డి, భిక్షపతి గౌడ్, మోహన్‌రావు, ఊర్మిల, ప్రధాన కార్యదర్శి సీహెచ్ యాద య్య, కోశాధికారి ఎల్.మాధవ రెడ్డి, గౌరవ సలహాదారుడు షణ్ముకాచారి పాల్గొన్నారు.
శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్రలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు. జైపురికాలనీలో ఛత్రపతి శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో చిరంజీవి గౌడ్, భవా నీగౌడ్, అనంతుల రాజిరెడ్డి, కాలనీ అధ్యక్షుడు యాదగిరి, యాదిలాల్ పాల్గొన్నారు.
: ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఎల్బీనగర్, మహేశ్వరం, మలక్‌పేట్, ఇబ్రహీంపట్నం నియోజక వర్గాల్లో ఘనంగా నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జనరంజక పాలన సాగించారని అందరూ కొనియాడారు. చైతన్యపురి, ఫణిగిరికాలనీ, గడ్డిఅన్నారం, నాగోలు, మన్సూరాబాద్‌తో పాటుగా పలు డివిజన్లలోని కూడళ్లలో శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు.
బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు గండి సన్ని యాదవ్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పేదల కు అన్నదాన కార్యకమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భవానీ ప్రవీణ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బిచినేపల్లి వెంకటేశ్వర్రావు, గండి కృష్ణయాదవ్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కల శ్రీశైలం యాదవ్, రమేశ్ ముదిరాజ్, రమణారెడ్డి, బైర శంకర్, రవీందర్‌రెడ్డి, కిరణ్, ఐలేశ్యాదవ్, సమ్ము రాములు, శివరాం పాల్గొన్నారు.
ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకుడు అజయ్ ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు తోట మహేశ్‌యాదవ్, రాష్ట్ర యువజన నాయకుడు సొంటి చంద్రశేఖర్‌రెడ్డి, శివప్రకాశ్, నాగలక్ష్మి, లక్కి, కల్యాణ్, ప్ర వీణ్, సాయి, కనకరాజు, శ్రీనివాస్, వెంకటేశ్, ఆంజనేయులు, గణేశ్, జలంధర్, నరేశ్, శ్రీధ ర్, నాగరాజు, మహేశ్ పాల్గొన్నారు.
చైతన్యపురి సాయినగర్ కాలనీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘ నంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో మాజీ కార్పొరేటర్లు జిన్నారం విఠల్‌రెడ్డి, రంగా నర్సింహా గుప్తా, రమణారెడ్డి, గట్టు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
: ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలను బీఎన్‌రెడ్డినగర్‌లో మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎస్కేడినగర్ నుంచి శ్రీపురం కాలనీవరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మోల్లూరి నవీన్ శర్మ, వనిపల్లి శ్రీనివాస్‌రెడ్డి, కొప్పుల నర్సింహారెడ్డి, నాయకులు శ్రీధర్‌రావు, గంగం ప్రేమ్‌నాథ్, విష్ణువర్ధన్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
: మండలంలో ఛత్రపతి శివాజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో శ్రీశైలం జాతీయ రహదారిపై నవతరం యూత్ సభ్యులు ఆయన చిత్రపటాలతో పాటు విగ్రహాలకు పూల దండలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మన్నే జయేందర్, పలువురు ప్రజాప్రతినిదులు,యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు.
: మహేశ్వరం మండలం, తుక్కుగూడ, జల్పల్లి, బడంగ్పేట్ సర్కిల్ పరిధిలో ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఛత్రపతి విగ్రహాలకు, చిత్ర పటాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి, చవ్వ శ్రావణ్ కుమా ర్, ప్రభాకర్ రెడ్డి, భిక్షపతి చారి, కృష్ణారెడ్డి, మల్లారెడ్డి, తదితరులు ఉన్నారు.
: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్లో భాగంగా బీఆర్ఎస్ సీనియర్ నేత చంపాపేట డివిజన్ యూత్ అధ్యక్షుడు గండికోట శ్రీనాథ్ ఆధ్వర్యంలో శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం బైరమాల్ గూడ హనుమాన్ దేవస్థానం నుంచి కర్మన్‌ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయం వరకు భారీ శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేతలు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.