Maha Kumbh : ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మేళా అయిన మహా కుంభమేళా (Maha Kumbh) లో భూటాన్ రాజు (Bhutan King) జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్‌చుక్ (Jigme Khesar Namgyel Wangchuck) పాల్గొన్నారు. మంగళవారం ఉదయం ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి (Uttarpradesh CM) యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) తో కలిసి ప్రయాగ్‌రాజ్ (Prayagraj) లోని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. ఆ తర్వాత గంగా హారతిలో పాల్గొన్నారు.
భూటాన్ రాజు వాంగ్‌చుక్ సోమవారమే లక్నో నగరానికి చేరుకున్నారు. ఆయనకు సీఎం యోగీ ఆదిత్యనాథ్ సాదర స్వాగతం పలికారు. ఈ విషయాన్ని యోగీ ఆదిత్యనాథ్ సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు. కాగా ఇండియా-భూటాన్ మధ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తూ భూటాన్ రాజు మహాకుంభ్‌కు హాజరుకావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇరుదేశాలకు చెందిన పలువురు ప్రముఖులు, భక్తులు గంగాహారతి, పూజా కార్యక్రమాల్లో పొల్గొన్నారు. సోమవారం భారత్‌కు విచ్చేసిన భూటాన్ రాజుకు చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. పుష్పగుచ్ఛం అందజేసి ఆయన క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. భారతీయ సాంస్కృతిక ప్రదర్శనలతో కళాకారులు వాంగ్చుక్కు స్వాగతం చెప్పారు.
Delhi Elections | రేపే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. సర్వం సిద్ధం చేసిన ఈసీ
BRS Whips | బీఆర్ఎస్ పార్టీ విప్‌లుగా సత్యవతి రాథోడ్, కేపీ వివేకానంద్
MLA Prashant Reddy | అసెంబ్లీని వాయిదా వేయడం పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం
MLA Talsani | ఇంతటి బాధ్యతారాహిత్య ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు : ఎమ్మెల్యే తలసాని
Harish Rao | ఇంకెప్పుడు ప్రిపేర్ అవుతారు?.. అసెంబ్లీ వాయిదాపై హరీశ్‌రావు ఆగ్రహం