ఆర్టీసీ కార్మికుల పోరుబాట
అధునాతమైన సర్వీసులను ప్రారంభిస్తాం. ఇలా అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో 2023లో కాంగ్రెస్ పార్టీ పలు హామీలిచ్చింది. ఇవన్నీ ఎప్పుడు అమలు చేస్తారంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
- 24న హలో కార్మిక.. చలో సెక్రటేరియెట్
- కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇవి..
- ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన ప్రక్రియ పూర్తి చేసి, రెండు పీఆర్సీ బకాయిలు చెల్లిస్తాం.
- పీఆర్సీలోకి టీజీఆర్టీసీ కార్మికులను చేరుస్తాం.
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా సదుపాయాలను కల్పిస్తాం.
- ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తాం.
- కాంగ్రెస్ మోసంపై సోషల్మీడియా ఉద్యమం
అధునాతమైన సర్వీసులను ప్రారంభిస్తాం. ఇలా అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో 2023లో కాంగ్రెస్ పార్టీ పలు హామీలిచ్చింది. ఇవన్నీ ఎప్పుడు అమలు చేస్తారంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటి అమలు విషయం విస్మరించిందని ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈనెల 24న ‘హలో కార్మిక.. చలో సెక్రటేరియెట్’కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి రేవంత్ సర్కార్ మోసాలపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను పోస్టర్గా చేసి సోషల్ మీడియా ఉద్యమానికి తెరలేపారు. ఆర్టీసీలో కార్మికులపై అధిక పనిభారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు ప్రతీ నెల రూ.350 కోట్లు కోత విధించకుండా చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం 24 మధ్యాహ్నం 2 గంటలకు ఇందిరాపార్క్ నుంచి ధర్నా ప్రారంభమవుతుందని టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ పేర్కొంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

