బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 19:04:51

నక్సల్ కాల్పులు : సీఏఎఫ్ జవాన్ మృతి

నక్సల్ కాల్పులు : సీఏఎఫ్ జవాన్ మృతి

కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో సోమవారం నక్సల్స్ జరిపిన దాడిలో ఛత్తీస్‌గఢ్ సాయుధ దళం (సీఏఎఫ్) జవాన్ మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. సీఏఎఫ్ 22 బెటాలియన్ క్యాంప్ ఉన్న జిల్లా ప్రధాన కార్యాలయానికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న కరియమెట ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. శిబిరంపై నక్సల్స్ కాల్పులు జరిపి పారిపోయారు.

చనిపోయిన జవాన్‌ను బీజాపూర్ జిల్లాలోని యెడ్‌పాల్ గ్రామానికి చెందిన జితేంద్ర బక్డేగా గుర్తించినట్లు పోలీసు సూపరింటెండెంట్ మోహిత్ గార్గ్‌ తెలిపారు. గాయపడిన జవాన్లను చికిత్స కోసం జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు.


logo