MK Stalin : లోక్‌సభ (Lok Sabha) లో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ (Rahul Gandhi) కి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin) మద్దతు పలికారు. బీజేపీ (BJP), ఎలక్షన్ కమిషన్ (Election Commission) కలిసి నేరపూరిత మోసాలకు పాల్పడ్డాయంటూ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయించాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. ఈసీని బీజేపీ ఒక రిగ్గింగ్ మిషన్లా మార్చిందని మండిపడ్డారు.
పోలింగ్‌కు సంబంధించి జరుగుతున్న అక్రమాలపై పోరాటంలో కాంగ్రెస్‌తో డీఎంకే కలిసి నడుస్తుందని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే అపహాస్యంపాలు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేమని అన్నారు. రాహుల్ ఆరోపణలపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఇదిలావుంటే ఇవాళ ఢిల్లీలో విపక్ష పార్టీల ఎంపీలు నిర్వహించిన ‘పార్లమెంట్ టు ఈసీ’ ర్యాలీ ఉద్రిక్తంగా మారింది.
అఖిలేశ్ యాదవ్ సహా పలువురు విపక్ష ఎంపీలు బ్యారికేడ్లు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రాహుల్, ప్రియాంక సహా పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.