World Cup 2025 : మరో 50 రోజుల్లో భారత్ (India) వేదికగా మహిళ వన్డే క్రికెట్ ప్రపంచకప్ టోర్నీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ ముంబై (Mumbai) లో ‘ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్-2025 (ICC Women’s Cricket World Cup 2025)’ ట్రోఫీని ఆవిష్కరించారు. భారత లెజెండ్ క్రికెటర్స్ యువరాజ్ సింగ్ (Yuvaraj Singh), మిథాలీ రాజ్ (Mithali Raj) తోపాటు ప్రస్తుత మహిళా క్రికెట్ స్టార్స్ హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur), స్మృతి మందాన (Smriti Mandhana), జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues), ఐసీసీ సీఈవో సంజోగ్ గుప్తా (Sanjog Gupta) ఈ ట్రోఫీ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఐసీసీ ఛైర్మన్ (ICC chairman) జై షా (Jay Shah) ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
‘ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్-2025’ ఇవాళ్టి నుంచి సరిగ్గా 50 రోజుల్లో అంటే సెప్టెంబర్ 30న ప్రారంభం కానుంది. అయితే 2016 తర్వాత భారత్ మహిళల ఐసీసీ క్రికెట్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వడం ఇదే తొలిసారి. 2016లో భారత్‌లో మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ జరిగింది. అదేవిధంగా అంతకుముందు కూడా 1978, 1997, 2013లో భారత్ మహిళల క్రికెట్ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చింది.