Rain Alert | హైదరాబాద్ : గత నాలుగైదు రోజుల నుంచి హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. నిన్న అర్ధరాత్రి కూడా హైదరాబాద్ నగరాన్ని వర్షం ముంచెత్తింది. భారీ వర్షానికి భాగ్యనగరం తడిసి ముద్దైంది. సోమవారం మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉంటుందని తెలంగాణ వెదర్‌మ్యాన్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. మధ్యాహ్నం తర్వాత అంటే 2 గంటల తర్వాత మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ వర్షం మధ్యాహ్నం నుంచి అర్ధారత్రి వరకు కొనసాగే అవకాశం ఉందన్నారు. పలు ప్రాంతాల్లో 25 నుంచి 55 మి.మీ. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఇక రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్, నల్లగొండ, యాదాద్రి, మహబూబాబాద్, ఖమ్మం, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో కూడా మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.
Today’s FORECAST ⚠️⛈️
HEAVY RAINFALL expected in various parts of South, Central, East, West TG like Rangareddy, Vikarabad, Sangareddy, Mahabubnagar, Nagarkurnool, Wanaparthy, Narayanpet, Gadwal, Nalgonda, Yadadri, Mahabubabad, Khammam, Hanmakonda, Bhadradri, Mulugu during…
— Telangana Weatherman (@balaji25_t) August 11, 2025