stock market | స్టాక్ మార్కెట్ భారీ పతనం.. సెన్సెక్స్ 1,300 పాయింట్లు నష్టం.. దిగజారిన రూపాయి
stock market : భారత మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 1360 పాయింట్లు నష్టపోయింది. దీంతో 75,000 పాయింట్ల దిగువకు సెన్సెక్స్ పడిపోయింది.
stock market : భారత మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 1360 పాయింట్లు నష్టపోయింది. దీంతో 75,000 పాయింట్ల దిగువకు సెన్సెక్స్ పడిపోయింది. నిఫ్టీ 50 కూడా 400 పాయింట్లు నష్టపోయింది. 23,144 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్, నిఫ్టీ 50 ఇండెక్స్ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద ఏకంగా ఈ ఒక్కరోజే రూ.9 లక్షల కోట్లు నష్టపోయింది.
సెన్సెక్స్ 30 సూచీలో ట్రెంట్, భారతీ ఎయిర్టెల్, హిందుస్తాన్ యునీలీవర్ మాత్రమే స్వల్ప లాభాల్లో కొనసాగుతుండగా, మిగతా షేర్లు నష్టాల బాటలోనే ఉన్నాయి. నిఫ్టీ 50 సూచీలో హిందాల్కో ఇండస్ట్రీస్, టాటా స్టీల్, లార్సెన్ అండ్ టర్బో, టాటా మోటార్స్ వంటి కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ యుద్ధం, చమురు సంక్షోభం, ధరల పెరుగుదల వంటివి నేటి మార్కెట్ పతనానికి కారణాలు. విదేశీ ఇన్వెస్టర్లు ఒత్తిడికి గురై అమ్మకాలకు పాల్పడ్డారు. అయితే, దేశీయ ఇన్వెస్టర్లు మాత్రం మార్కెట్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లు విపరీతమైన ఒత్తిడిలో ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు 100 డాలర్లకు పైగా పెరగడం మార్కెట్‌పై ప్రభావం చూపిస్తోంది. బ్యాంకింగ్ షేర్లు భారీ నష్టాల్లో ఉన్నాయి.
హెచ్డీఎఫ్సీ షేర్లు ఏకంగా 2 శాతం వరకు, ఎస్బీఐ షేర్లు 2.3 శాతం వరకు నష్టపోగా, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. మెటల్, ఇన్ఫ్రా షేర్లు ఎక్కువగా అమ్మకాలు జరుగుతున్నాయి. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ బాగా పడిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 92.47 వద్ద ట్రేడవుతోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ద్వితీయ స్థానం
Jobs HAL | హెచ్ఏఎల్లో 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. అక్టోబర్ 17 చివరితేదీ
‘విశ్వామిత్ర సేవలు అభినందనీయం’
‘వినియోగదారుల హక్కులపై చైతన్యం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

