చండూరు, మార్చి 13 : చండూరు మండలం కొండాపురం గ్రామానికి చెందిన బోయపల్లి మహేశ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. కాలు విరగడంతో ఆపరేషన్ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు. మహేశ్ ఆర్థిక స్థితి విషయాన్ని కొండాపురం గ్రామానికి చెందిన గునగంటి లింగస్వామి టీఆర్ ఫౌండేషన్ చైర్మన్ బొబ్బల వెంకట్రామ్ రెడ్డి (టామన్న) కి తెలియజేయగా ఆయన వెంటనే స్పందించి ఫౌండేషన్ సభ్యులు హరీశ్ పెసర్ల ద్వారా ఆస్పత్రి ఖర్చుల కోసం శుక్రవారం రూ.15 వేలు ఆర్ధిక సహాయంగా అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రామన్నకు మహేశ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పర్వతం మహేశ్, ఫౌండేషన్ సభ్యులు గిరి, శివ, సిలివేరు మహేశ్, చెడుబుద్ధి వెంకన్న, మంగళపల్లి శ్రవణ్ పాల్గొన్నారు.