Murder | విజయనగరం : ఓ యువకుడు తన మేనమామ భార్యపై కన్నేశాడు. ఆమెను లొంగదీసుకుని, అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత తనకు అడ్డు వస్తున్న మేనమామను అంతమొందించాడు. ఈ దారుణ ఘటన విజయనగరం జిల్లాలోని కెరటం గ్రామంలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కెరటం గ్రామానికి చెందిన కృష్ణ తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఇక కృష్ణ మేనల్లుడు సాయి వీరి ఇంటికి తరుచుగా వచ్చి వెళ్లేవాడు. ఈ క్రమంలో మేనమామ భార్యతో సాయికి చనువు పెరిగింది. ఈ చనువు అక్రమ సంబంధానికి దారి తీసింది. విషయం తెలుసుకున్న మేనమామ కృష్ణ.. మేనల్లుడు సాయిని పలుమార్లు హెచ్చరించాడు. అయినా కూడా అతను వినిపించుకోలేదు.
ఇక తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని, మేనమామను అంతమొందిస్తే తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని సాయి భావించాడు. ఇంకేముంది ఇటీవలే ఎవరికీ తెలియకుండా కృష్ణను హత్య చేసి.. కెరటం గ్రామానికి సమీపంలో ఉన్న చెరువు వద్ద పూడ్చిపెట్టాడు. అనంతరం తనకేమీ తెలియనట్లు ఆ ఇంటికి వచ్చి వెళ్తున్నాడు.
అయితే కృష్ణ గత కొన్ని రోజుల నుంచి కనిపించడం లేదని బంధువులు, గ్రామస్తులు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కృష్ణ చివరిసారిగా సాయితో కలిసి కనిపించినట్లు పోలీసులు ఆధారాలు సేకరించారు. ఆ తర్వాత సాయి ఆకస్మాత్తుగా కనిపించడంతో పోలీసుల అనుమానానికి బలం చేకూరింది. దీంతో సాయి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. గ్రామ పరిసరాలు, సమీప పట్టణాలు, బంధువుల ఇళ్లు అన్నీ వెదికినా, అతడి జాడ ఇంకా దొరకలేదు. నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలో పట్టుకుని న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు.