– రాజాపేటలో బీజేపీ శ్రేణుల నిరసన
రాజాపేట, మార్చి 13 : వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రాజాపేట మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు బీజేపీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లో వోల్టేజీ తో నాణ్యమైన విద్యుత్ సరఫరా లేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై నినాదాలు చేశారు. వెంటనే 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.