న్యూఢిల్లీ: పార్లమెంట్ హౌజ్ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఆఫీసు వరకు ర్యాలీ తీసే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్గమధ్యంలో వాళ్లను అడ్డుకుని అరెస్టు చేశారు. వారితో పాటు ఇతర విపక్ష నేతల్ని కూడా ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్సుల్లోకి ఎక్కించి పార్లమెంట్ స్ట్రీట్ పోలీసు స్టేషన్‌కు కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గేతో పాటు జైరాం రమేశ్‌ను తరలించారు. తమ పోరాటం రాజకీయం కోసం కాదు అని, రాజ్యాంగం కోసం అని రాహుల్ గాంధీ రిపోర్టర్లకు తెలిపారు. నిజాలు యావత్ దేశం ముందు ఉన్నాయని అన్నారు.
आज जब हम चुनाव आयोग से मिलने जा रहे थे, INDIA गठबंधन के सभी सांसदों को रोका गया और हिरासत में ले लिया गया।
वोट चोरी की सच्चाई अब देश के सामने है।
यह लड़ाई राजनीतिक नहीं – यह लोकतंत्र, संविधान और ‘एक व्यक्ति, एक वोट’ के अधिकार की रक्षा की लड़ाई है।
एकजुट विपक्ष और देश का हर… pic.twitter.com/SutmUirCP8
— Rahul Gandhi (@RahulGandhi) August 11, 2025
కొందరు ఎంపీలు పార్లమెంట్ స్ట్రీట్‌లో ఉన్న పీటీఐ బిల్డింగ్ వద్ద బైఠాయించారు. ఎన్నికల సంఘం ఆఫీసుకు కిలోమీటరు దూరంలో వాళ్లను అడ్డుకున్నారు. బీహార్ ఓటర్ల జాబితా సవరణ చేపట్టడాన్ని విపక్షాలు వ్యతిరేకించాయి. సిర్‌ను ఆపేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇవాళ ట్రాన్స్‌పోర్టు భవన్ వద్ద పోలీసులు కొందరు ఎంపీలను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐఆర్, వోట్ చోరీ అని తెల్ల క్యాప్‌లపై రాసి వాటిని విపక్ష ఎంపీలు ధరించారు. సిర్కు వ్యతిరేకంగా ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. పార్లమెంట్ మకర ద్వారం నుంచి నిరసన ర్యాలీ ప్రారంభమైంది.
मोदी सरकार डरी हुई है, कायर है।
: कांग्रेस महासचिव व सांसद श्रीमती @priyankagandhi जी pic.twitter.com/4o7rTtjp8N
— Congress (@INCIndia) August 11, 2025
టీఆర్ బాలు, సంజయ్ రౌత్, డెరిక్ ఓబ్రెయిన్, ప్రియాంకా గాంధీ, అఖిలేశ్ యాదవ్‌తో పాటు ఇతర నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. ట్రాన్స్పోర్ట్ భవన్ వద్ద టీఎంసీ ఎంపీలు మహువా మొయిత్రా, సుస్మితా దేవ్, సంజనా జాతవ్, జ్యోతిమని ఎంపీలు బారికేడ్లను ఎక్కారు. బీహార్‌లో చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను వెనక్కి తీసుకోవాలని ఎంపీలు డిమాండ్ చేశారు. సిర్ ప్లస్ ఓట్ తెఫ్ట్ ఈక్వల్ టు మర్డర్ ఆఫ్ డెమోక్రసీ అని బ్యానర్లపై రాశారు. ఎన్నికల సంఘం, ప్రభుత్వం కుమ్మక్కై ఓటర్ల జాబితాను సవరిస్తున్నట్లు విపక్షాలు ఆరోపించాయి.