Mahakumbh : ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లో జరుగుతున్న మహా కుంభమేళా (Mahakumbh) కు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. మౌని అమావాస్య (Mauni Amavasya) ప్రభావంతో భక్తుల సంఖ్య ఇవాళ భారీగా పెరిగింది. బుధవారం ఒక్కరోజే సాయంత్రం నాలుగు గంటల వరకే ప్రయాగ్రాజ్ (Prayagraj) లోని త్రివేణి సంగమంలో అమృతస్నానాలు చేసిన భక్తుల సంఖ్య 6 కోట్లు దాటింది. దాంతో త్రివేణి సంగమంలోని ఘాట్లు అన్ని కిటకిటలాడుతున్నాయి. ఇవాళ మొత్తంగా కుంభమేళాకు వచ్చే భక్తుల సంఖ్య 8 కోట్లు దాటవచ్చునని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
అయితే మౌని అమావాస్య సందర్భంగా మహా కుంభమేళాకు భక్తుల తాకిడి భారీగా పెరగడంతో బుధవారం ఉదయం తీర్థరాజ్ సంగం తీరంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో 14 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు రద్దీని తగ్గించేందుకు యూపీ సీఎం ఒక ప్రకటన చేశారు. మౌనీ అమావాస్య సందర్భంగా పుణ్య స్నానాలు చేసేందుకు భక్తులు త్రివేణి సంగమానికి తరలి రావాల్సిన అవసరం లేదని, వారివారి సమీప ఘాట్లలో స్నానాలు చేసినా సరిపోతుందని చెప్పారు.
అయినా భక్తుల తాకిడి ఏ మాత్రం తగ్గలేదు. ప్రవాహంలా త్రివేణి సంగమానికి తరలి వస్తూనే ఉన్నారు. మౌని అమావాస్య నేపథ్యంలో పలువురు సాధువులు, యోగులు కూడా భారీ సంఖ్యలో అమృత స్నానాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా సాధువులు, యోగులపై యూపీ ప్రభుత్వం హెలికాప్టర్లతో ఆకాశం నుంచి పూలు చల్లించింది. కాగా, బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకే మహా కుంభమేళాకు విచ్చేసిన భక్తుల సంఖ్య 5.71 కోట్లు దాటిందని, అదేవిధంగా జనవరి 28 వరకు మొత్తం 16 రోజుల్లో కుంభమేళాకు హాజరైన భక్తుల సంఖ్య 19.94 కోట్లు దాటిందని ఉత్తరప్రదేశ్ సమాచార శాఖ తెలిపింది.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఈ నెల 13 నుంచి మహా కుంభమేళా ప్రారంభమైంది. ఫిబ్రవరి 26న ఈ మహా కుంభమేళా ముగియనుంది. ఈ మహా కుంభమేళా ముగిసేనాటికి భక్తుల సంఖ్య 50 కోట్లు దాటే అవకాశం ఉందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
#MahaKumbh2025 | Prayagraj, UP: Drone visuals from the Ghats of Triveni as a huge number of devotees reach for the Amrit Snan on the occasion of Mauni Amavasya.
As of 12 pm today, about 4.24 crore devotees have taken a holy dip. The total number of devotees who have taken a holy… pic.twitter.com/vOAAnlAhOm
— ANI (@ANI) January 29, 2025
Road accident | సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది భారత పౌరులు దుర్మరణం
PM Modi | ‘ఫిబ్రవరి 5న ఆప్ పోతుంది.. బీజేపీ వస్తుంది’.. ఢిల్లీలో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం
Income Tax | ట్రంప్ కీలక ప్రతిపాదన.. అమెరికాలో ఆదాయపు పన్ను రద్దు!
ఇక వారానికి నాలుగు రోజులే పని.. బ్రిటన్లో 200 కంపెనీలో కీలక నిర్ణయం!
Milk | చిన్న పిల్లలకు ఆవు పాలు మంచివా? గేదె పాలు మంచివా?