మంగళవారం 14 జూలై 2020
National - Jun 19, 2020 , 18:14:00

చైనాపై నీతి గ్రామస్తుల నిరసన

చైనాపై నీతి గ్రామస్తుల నిరసన

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా భారత్‌- చైనా సరిహద్దులోగల నీతి గ్రామంలో చైనాకు వ్యతిరేకంగా గ్రామస్తులు శుక్రవారం నిరసన తెలిపారు. తూర్పు లడక్‌ పరిధిలోని గాల్వాన్‌ వ్యాలీలో భారత్‌-చైనా దళాల మధ్య జరిగిన ఘర్షణలో 20మంది భారత సైనికులు మృతి చెందడం పట్ల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎలాంటి పరిస్థితుల్లోనైనా తాము భారత సైన్యానికి సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. భారత సైనికుల మృతి తమను ఎంతగానో బాధించిందని, చైనా సైనికులు తమ గ్రామంలోకి అంత సులువుగా అడుగు పెట్టలేరని, చుట్టూ అపారమైన కొండలు, సముద్రమట్టానికి 12000 అడుగుల ఎత్తులో ఉంటుందని పేర్కొన్నారు. వైమానిక దాడులు మినహా చైనా సైనికులు చేయగలిగిదేమీ లేదన్నారు. నీతి గ్రామం ఇండో-చైనా సరిహద్దులో చివరి గ్రామం. సైన్యానికి రెండో రక్షణమార్గంగా ఈ గ్రామానికి పేరుంది. ఇదిలా ఉండగా గత మూడురోజులుగా చమోలీ జిల్లాలోని ఇండో-చైనా సరిహద్దులో వచ్చేపోయే వాహనాలను భారత సైనికులు  తనిఖీ చేస్తున్నారు. ఆర్మీ వాహనాల రాకపోకలు సైతం పెరిగాయని గ్రామస్తులు తెలిపారు.logo