అహ్మదాబాద్ : ఓ మేక వింత జీవికి జన్మనిచ్చింది. ఆ జీవి అచ్చం మనిషి ముఖాన్ని పోలి ఉంది. దీంతో దేవుడే ఈ రూపంలో జన్మించాడంటూ స్థానికులు పూజలు చేశారు. ఈ ఘటన గుజరాత్లోని సోనాఘడ్ జిల్లాలోని సెల్టీపాడా గ్రామంలో వెలుగు చూసింది.
అజయ్ భాయ్ వాసవ అనే రైతు మేకలను పెంచుకుంటున్నాడు. దాంట్లో ఓ మేక ఇటీవలే ప్రసవించింది. జన్మించిన మేక పిల్ల అచ్చం మనిషి ముఖాన్ని పోలి ఉంది. కాళ్లు, చెవులు మేక ఆకారాన్ని పోలి ఉన్నప్పటికీ, తోక అసలే లేదు. అలా పుట్టిన మేక పిల్ల జన్మించిన పది నిమిషాలకే చనిపోయింది. మనిషి ఆకారంలో పుట్టిన ఆ మేక పిల్లను దేవుడిగా స్థానికులు పూజించారు. అనంతరం దాన్ని పూడ్చిపెట్టారు. అయితే స్థానికులు ఈ జీవి ఫోటోలను చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.