Life Ban : మన దేశంలో రాజకీయ నాయకులు (Politicians) ఏవైనా క్రిమినల్ కేసుల (Criminal ceses) లో దోషులుగా నిరూపితమైతే వారిపై ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం ఉంటుంది. అయితే క్రిమినల్ కేసులలో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై కేవలం ఆరేళ్ల నిషేధం సరిపోదని, జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపై నిషేధం విధించాలని కోరుతూ అశ్వినీ ఉపాధ్యాయ్ (Ashwini Upadhyay) అనే న్యాయవాది సుప్రీంకోర్టు (Suprem court) లో పిటిషన్ వేశారు.
ఇటీవల ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. మీ అభిప్రాయం తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఇవాళ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం విధించడం అత్యంత కఠినమైన చర్య అని, కాబట్టి ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరేళ్ల నిషేధం సరిపోతుందని తన అఫిడవిట్లో పేర్కొంది.
అయినా క్రిమినల్ కేసులలో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం విధించాలా..? ఆరేళ్ల నిషేధం విధించాలా..? అనేది పార్లమెంట్ పరిధిలోని అంశమని, పార్లమెంట్ ఇప్పిటికే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఆరేళ్ల నిషేధం విధించాలని నిర్ణయించిందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇక ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తన తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉంది.
Amit Shah | తమిళనాడులో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే : అమిత్ షా
Arvind Kejriwal | కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్లడం లేదు.. అవి ఆధారంలేని ఊహాగానాలు : ఆప్
Wild Animals | వైల్డ్ వార్.. దేశంలో మనుషులు-వన్యప్రాణుల మధ్య సంఘర్షణ
KTR | కాంగ్రెస్ పతనం ప్రారంభం.. 15 నెలలకే రేవంత్ పాలనపై ప్రజల్లో విరక్తి: కేటీఆర్
Lord Shiva | నేలపై పడుకున్నట్టుగా ఉండే శివలింగం.. అక్బర్‌కు ఆ ఆలయానికి ఉన్న సంబంధమేంటి?