Ranjana Nachiyaar : దేశంలోని అన్ని రాష్ట్రాలు పాఠశాలల్లో త్రి భాషా సూత్రాన్ని (Three Language Imposition) అమలు చేయాలన్న కేంద్రం ఆదేశాలను నిరసిస్తూ బీజేపీ నాయకురాలు (BJP leader), నటి రంజనా నచియార్ (Ranjana Nachiyaar) మంగళవారం ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇవాళ నటుడు విజయ్ (Actor Vijay) కి చెందిన ‘తమిళగ వెట్రి కళగం (Tamilaga Vettri Kazhagam – TVK)’ పార్టీలో చేరారు.
తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ ప్రైవేట్ రిసార్టులో టీవీకే ప్రథమ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రంజనా నచియార్ తాను టీవీకేలో చేరుతున్నట్లు ప్రకటించారు. నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌ని మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌తో పోల్చారు. భారత జాతిపైన, ద్రవిడ విధానాలపైన విజయ్‌కి ఉన్న అభిమానం తనకు నచ్చిందని, అందుకే తన రాజకీయ భవిష్యత్తుకు సరైన వేదిక టీవీకేనే అని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పారు.
విజయ్ ఇప్పుడు తమిళనాడు ముందున్న పెద్ద ఆశ అని రంజనా వ్యాఖ్యానించారు. కాగా త్రి భాషా సూత్రం పేరుతో తమిళనాడుపై బలవంతంగా హిందీ భాషను రుద్దాలని చూసిన కేంద్రంలోని బీజేపీ సర్కారుకు తాజా పరిణామం తొలి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.
Amit Shah | తమిళనాడులో వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమే : అమిత్ షా
Arvind Kejriwal | కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్లడం లేదు.. అవి ఆధారంలేని ఊహాగానాలు : ఆప్
Wild Animals | వైల్డ్ వార్.. దేశంలో మనుషులు-వన్యప్రాణుల మధ్య సంఘర్షణ
KTR | కాంగ్రెస్ పతనం ప్రారంభం.. 15 నెలలకే రేవంత్ పాలనపై ప్రజల్లో విరక్తి: కేటీఆర్
Lord Shiva | నేలపై పడుకున్నట్టుగా ఉండే శివలింగం.. అక్బర్‌కు ఆ ఆలయానికి ఉన్న సంబంధమేంటి?