Arvind Kejriwal : ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) రాజ్యసభ సభ్యుడి (Rajya Sabha Member) గా పార్లమెంటు (Parliament) కు వెళ్లనున్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఆప్ కొట్టిపారేసింది. అర్వింద్ కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్లడం లేదని, అవన్నీ ఆధారంలేని ఊహాగానాలని ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంకా కక్కర్ చెప్పారు. ఇదంతా మీడియా చేస్తున్న అసత్య ప్రచారమని ఆమె తోసిపుచ్చారు.
కేజ్రీవాల్‌పై ఇంతకుముందు కూడా మీడియాలో ఇలాంటి ఊహాగానాలే కొనసాగాయని, ఆయన పంజాబ్ ముఖ్యమంత్రి కాబోతున్నారనే ప్రచారం జరిగిందని కక్కర్ గుర్తుచేశారు. ఇప్పుడు రాజ్యసభకు వెళ్తున్నారనే ప్రచారం జరుగుతోందని, ఇది కూడా మీడియా చేస్తున్న ఉత్త ప్రచారమేనని ఆమె కొట్టిపారేశారు. కాగా పంజాబ్‌కు ఆప్ ఎంపీ సంజీవ్ అరోరా లూథియానా అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల్లో ఆప్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు.
దాంతో సంజీవ్ అరోరాను పంజాబ్ అసెంబ్లీకి పంపి, ఆయన స్థానంలో రాజ్యసభ సభ్యుడిగా కేజ్రీవాల్ పార్లమెంట్లో అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని తాజాగా ప్రియాంకా కక్కర్ కొట్టిపారేశారు.
Wild Animals | వైల్డ్ వార్.. దేశంలో మనుషులు-వన్యప్రాణుల మధ్య సంఘర్షణ
KTR | కాంగ్రెస్ పతనం ప్రారంభం.. 15 నెలలకే రేవంత్ పాలనపై ప్రజల్లో విరక్తి: కేటీఆర్
Lord Shiva | నేలపై పడుకున్నట్టుగా ఉండే శివలింగం.. అక్బర్‌కు ఆ ఆలయానికి ఉన్న సంబంధమేంటి?