Amit Shah : కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తమిళనాడు (Tamil Nadu) లోని స్టాలిన్ సర్కారు (NDA government) పై నిప్పులు చెరిగారు. బుధవారం ఆ రాష్ట్రంలోని కోయంబత్తూరు, తిరువన్నమలై, రామనాథపురం జిల్లా కేంద్రాల్లో బీజేపీ కార్యాలయాలను ప్రారంభించిన అనంతరం పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన సభలో అమిత్ షా మాట్లాడారు. డీఎంకే అవినీతి పార్టీ అని, అవినీతిపరులంతా ఆ పార్టీలోనే ఉన్నారని విమర్శించారు.
అవినీతి కేసుల్లో డీఎంకే నేతలు మాస్టర్ డిగ్రీలు చదివారని అమిత్ షా మండిపడ్డారు. వాళ్ల నాయకుల్లో ఒకరు క్యాష్ ఫర్ జాబ్స్ కేసులో, మరొకరు మనీ లాండరింగ్, అక్రమ ఇసుక తవ్వకం కేసులో, ఇంకొకరు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఉన్నారని చెప్పారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు నిధులు ఇవ్వడం లేదని సీఎం స్టాలిన్ చేసిన ఆరోపణలను కూడా షా ఖండించారు. గత ఐదేళ్లలో తమిళనాడుకు కేంద్రం ఐదు లక్షల కోట్లు ఇచ్చిందని చెప్పారు.
తమిళనాడులో అవినీతిని అంతమొందించడమే బీజేపీ లక్ష్యమని షా వ్యాఖ్యానించారు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏదే విజయమని, ఇక్కడ ఎన్డీఏ సర్కారు కొలువుదీరుతుందని జోష్యం చెప్పారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారిని రాష్ట్రం నుంచి పారదోలాలని అన్నారు.
Arvind Kejriwal | కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్లడం లేదు.. అవి ఆధారంలేని ఊహాగానాలు : ఆప్
Wild Animals | వైల్డ్ వార్.. దేశంలో మనుషులు-వన్యప్రాణుల మధ్య సంఘర్షణ
KTR | కాంగ్రెస్ పతనం ప్రారంభం.. 15 నెలలకే రేవంత్ పాలనపై ప్రజల్లో విరక్తి: కేటీఆర్
Lord Shiva | నేలపై పడుకున్నట్టుగా ఉండే శివలింగం.. అక్బర్‌కు ఆ ఆలయానికి ఉన్న సంబంధమేంటి?