PM Modi : అమెరికా అధ్యక్షుడు (USA president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కు ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ఫోన్ చేశారు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వారం రోజులకు మోదీ ఆయనకు ఫోన్ చేశారు. వరుసగా రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు అభినందనలు తెలియజేశారు. ‘చరిత్రాత్మకంగా రెండోసారి అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ప్రియ మిత్రుడికి అభినందనలు’ అని మోదీ ట్వీట్ కూడా చేశారు.
‘అమెరికా అధ్యక్షుడైన నా ప్రియమిత్రుడు ట్రంప్‌తో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. చరిత్రాత్మకంగా రెండోసారి అధ్యక్షుడైన ఆయనను అభినందిస్తున్నా. పరస్పరం రెండు దేశాల ప్రయోజనాల కోసం కలిసి పనిచేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ప్రపంచ శాంతి, సామరస్యం, భద్రత, ప్రజల సంక్షేమం కోసం మేం కలిసి పనిచేస్తాం’ అని మోదీ తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో పేర్కొన్నారు.
Custodial Death | లాకప్ డెత్ కేసు.. ఐజీ సహా 8 మంది పోలీసులకు జీవితఖైదు
Crime news | దగ్గరి బంధువుతో సహజీవనం.. కాలిన సూట్‌కేసులో మహిళ మృతదేహం..!
Snow Sculpture | ఆ మంచు శిల్పాలు అదుర్స్.. పోటీలో భారత్‌కు కాంస్యం.. Video
Bandi Sanjay | పద్మ అవార్డులు స్థాయి ఉన్నవాళ్లకే ఇస్తాం.. గద్దర్‌కు ఎలా ఇస్తాం : బండి సంజయ్