Kakinada Blast | 21కి పెరిగిన మృతుల సంఖ్య.. ఈ దుర్ఘటనలో బలైంది వీళ్లే..!
Kakinada Blast : ఏపీలోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం పేలుడు పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 21కి పెరిగింది.
Kakinada Blast : ఏపీలోని కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం పేలుడు పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 21కి పెరిగింది. బాణాసంచా కేంద్రంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సంభవించిన భారీ పేలుడులో.. 15 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వారికి ఘటనా స్థలివద్దే పంచనామా నిర్వహించారు. అనంతరం మృతదేహాలను కాకినాడలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తామని ఏపీ ప్రభుత్వం తెలిపింది.
వేట్లపాలెం, జి.మేడపాడు గ్రామాల మధ్య ఉన్న బాణాసంచా తయారీ కేంద్రంలో శనివారం మధ్యాహ్నం భారీ పేలుడు సంభవించింది. అక్కడే పేలుడు పదార్ధాలు పెద్ద మొత్తంలో ఉండడంతో ప్రాణనష్టం జరిగింది. పేలుడు తీవ్రతకు సమీపంలోని పంటపొలాల్లోకి మృతదేహాలు ఎగిరిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 21 మందికిపైగా సజీవ దహనమయ్యారు. తీవ్రంగా గాయపడిన పలువురికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
Tragedy strikes #AndhraPradesh as a devastating explosion rocks a fireworks manufacturing unit between Vetlampadu and G. Medapadu in #Kakinada
According to early reports, the blast was so powerful that 18 people were burned alive on the spot, leaving the area in shock and… https://t.co/K1sAtx0iAI pic.twitter.com/TwHi4juF41
— Hyderabad DNA (@HyderabadDna) February 28, 2026
ప్రమాదం విషయం తెలిసిన వెంటనే విపత్తు నిర్వహణ దళాలు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనితకు.. అధికారులు ప్రమాదం జరిగినతీరు, సహాయక చర్యలను వారికి వివరించారు. బాంబు పేలుడులో అడబాల శ్రీను, కడింపల్లి కృస్ణమ్మ, సాధనాల సత్యవేణి, గంపల మంగ, గొడతా మహేశ్, గొడతా రాము.. చనిపోయినట్టుగా గుర్తించారు. మరికొందరి పేర్లు తెలియాల్సి ఉంది.
కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేడు సమీక్ష నిర్వహించారు. విజయనగరం పర్యటనలో ఉన్న సీఎం కు ప్రమాద ఘటనను అధికారులు వివరించారు.#AndhraPradesh
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 28, 2026
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

