‘జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించేందుకు కృషి’
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహకారంతో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించేందుకు చొరవ తీసుకుంటానని నల్లగొండ కార్పొరేషన్ తొలి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ముందుంటానని ఆమె హామీ ఇచ్చారు.
– నల్లగొండ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్‌రెడ్డి
నల్లగొండ, ఫిబ్రవరి 28 : మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహకారంతో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇప్పించేందుకు చొరవ తీసుకుంటానని నల్లగొండ కార్పొరేషన్ తొలి మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ముందుంటానని ఆమె హామీ ఇచ్చారు. నల్లగొండ నగర తొలి మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి దంపతులను శనివారం నల్లగొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అభినందించి సత్కరించారు. ప్రెస్ క్లబ్ మెమెంటో ను అందజేశారు. ఈ సందర్భంగా నల్లగొండ పట్టణంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను మేయర్ దృష్టికి తీసుకువెళ్లారు.
ఏళ్ల తరబడి జిల్లా కేంద్రంలో పని చేస్తున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు. నగర తొలి మేయర్‌గా రికార్డు సృష్టించిన చైతన్య శ్రీనివాస్ రెడ్డికి నగర అభివృద్ధి విషయంలో సంపూర్ణ సహకారం అందిస్తామని జర్నలిస్టులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్రెడ్ల చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి వంగాల శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారి గుండాల యాదగిరి, ఉపాధ్యక్షులు యాదయ్య, మదనాచారి, కార్యదర్శులు వరకాంతం కిరణ్ రెడ్డి, లింగయ్య, సహాయ కార్యదర్శులు మహమ్మద్ సయ్యద్, నత్తి ఉపేందర్, ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు సోమ శేఖర్, అశోక్ కుమార్, భాస్కర్, వెంకన్న, రవి, శ్రీను, కృష్ణ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

