కారేపల్లి, ఫిబ్రవరి 28 : కారేపల్లి బ్రిలియంట్స్ స్కూల్లో శనివారం సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఫేర్‌లో విద్యార్థులు తన సృజనాత్మకతను చాటుతూ వర్కింగ్ మోడల్స్‌ను ప్రదర్శించారు. అగ్ని విస్పోటనం, వర్షపునీటి సంరక్షణ, సోలార్ ఎనర్జీ వినియోగం, మాగ్నెటిజం వంటి మోడల్స్ ఆకట్టుకోవటంతో పాటు అలోచింపచేశాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మల్లెల నాగేశ్వరరావు మాట్లాడుతూ సైన్స్ మన దైన దిన జీవితంలో ఒక భాగమన్నారు. విద్యార్ధులు ప్రశ్నించటం, శోధించటం, అలోచించటంతోనే విజ్ఞానం సమపార్జన సాధ్యమన్నారు. శాస్త్రీయ చైతన్యంతో సమాజంలో మూఢ విశ్వాసాలు తుదముట్టించవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వింజిమన్, షైనీ, ఇందిర, సరోజా, మౌనిక, ముంతాజ్, ఉమారాణి, జ్యోతి పాల్గొన్నారు.
కారేపల్లి కస్తూర్బా విద్యాలయంలో జాతీయ సైన్స్ డే సంధర్భంగా సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. విద్యార్ధులు మూఢనమ్మకాలు, సైన్స్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ చేసిన సాంస్కతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్ధుల చేతులపై సైన్స్ సంబంధించిన చిత్రాలను మేహందిగా పెట్టుకున్నారు. ప్రతిభ చూపిన విద్యార్ధులను విద్యాలయ స్పెషల్ ఆఫీసర్ జీ.ఝాన్సీసౌజన్య అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె.కవిత, జి.విజయ మమత, స్వాతి, అన్నపూర్ణ, షాహిన్ బేగం, విజయలక్ష్మి, కష్ణవేణి పాల్గొన్నారు.

కారేపల్లిలో ఘనంగా సైన్స్ డే