బుధవారం 08 జూలై 2020
National - Jun 06, 2020 , 10:04:07

స‌రిహ‌ద్దు ఉత్కంఠ‌.. భార‌త‌, చైనా సైన్యాధికారుల చ‌ర్చ‌లు

స‌రిహ‌ద్దు ఉత్కంఠ‌.. భార‌త‌, చైనా సైన్యాధికారుల చ‌ర్చ‌లు

హైద‌రాబాద్‌: భార‌త్‌, చైనా మ‌ధ్య బోర్డ‌ర్ టెన్ష‌న్ నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఇవాళ రెండు దేశాల‌కు చెందిన సైన్యాధికారులు చ‌ర్చ‌లు నిర్వ‌హించ‌నున్నారు. క‌మాండ‌ర్ స్థాయిలో చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ల‌డాఖ్‌, సిక్కీం ప్రాంతాల్లో ఇటీవ‌ల ఇరు దేశాల‌కు చెందిన సైనికులు ఘ‌ర్ష‌ణ‌కు పాల్ప‌డిన విష‌యం తెలిసిందే. ద్వైపాక్షిక చ‌ర్చ‌ల‌ను ఇండియా ఆహ్వానించింది.  ఇంండియ‌న్ బోర్డ‌ర్ పాయింట్ మీటింగ్‌కు కేంద్ర‌మైన చుసుల్‌-మోల్డో ప్రాంతంలో స‌మావేశం జ‌ర‌గ‌నున్న‌ది. భార‌త్‌ త‌ర‌పున 14 కార్ప్స్ క‌మాండ‌ర్ అయిన‌ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ హ‌రింద‌ర్ సింగ్‌, చైనా త‌ర‌పున టిబెట్ మిలిట‌రీ డిస్ట్రిక్ క‌మాండ‌ర్ చ‌ర్చ‌ల్లో పాల్గొంటారు.  ఈ స‌మావేశంలో క‌మాండ‌ర్ల‌తో పాటు మ‌రో ప‌ది మంది ఆఫీస‌ర్లు కూడా ఉంటారు.

 


logo