ఇండియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ లో టాప్ ప్లేస్ నటుల్లో తల అజిత్ ఒకడు. కోలీవుడ్ తోపాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా అజిత్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్‌గా కనిపించే అజిత్ పబ్లిక్ ఫంక్షన్స్ కు దూరంగా ఉంటాడు. ఒకవేళ ఎప్పుడైనా ఏ కార్యక్రమానికైనా హాజరైతే అభిమానులతో సెల్ఫీలు దిగేందుకు, వారికి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చేందుకు నో చెప్తుంటాడు.
అజిత్ సతీమణి షాలినితో కలిసి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చాయి. వీలైనంత త్వరగా ఓటేసి వెళ్లిపోవాలనుకున్నాడు అజిత్. అయితే అజిత్-షాలిని వచ్చేటప్పటికి అక్కడ చాలా మంది ఓటర్లున్నారు. అజిత్ అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
ఓ అభిమాని అనుమతి లేకుండా అజిత్‌తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు. అంతలోనే మరో ఫ్యాన్ కూడా సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తుంటే ఓపిక నశించిపోవడంతో..అతడి ఫోన్ లాక్కున్నాడు అజిత్. అభిమాని ఫోన్ లాక్కున్నపుడు తీసిన వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. అభిమానులు యాక్టర్లకు ప్రైవసీ ఇవ్వకుండా ఇలా చేయడం వారికి ఇబ్బంది కలిగించే విషయమే.
ఇవి కూడా చదవండి
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
మరో పీరియాడిక్ డ్రామాలో రానా..?
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్‌కల్యాణ్
దీపికా, అమితాబ్ కాంబోలో మరో సినిమా
ఆలోచింపజేస్తున్న ‘రిపబ్లిక్’ టీజర్