Ram Charan | RC17 షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. డిసెంబర్ చివరి వారంలో రామ్‌చరణ్-సుకుమార్ మూవీ పట్టాలెక్కే ఛాన్స్!
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకోవడంతో పాటు రామ్‌చరణ్ కెరీర్లోనే ఓ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది.
Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో సినిమా వస్తుందంటే అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకోవడంతో పాటు రామ్‌చరణ్ కెరీర్లోనే ఓ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు దాదాపు మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో RC17పై భారీ హైప్ నెలకొంది. ఈ నేపథ్యంలో సినిమాకు సంబంధించి తాజాగా వినిపిస్తున్న అప్డేట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
రామ్‌చరణ్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ వేడుకకు హాజరై ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టడం విశేషం. దీంతో మెగా అభిమానులకు ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఆసక్తి పెరిగింది. ప్రస్తుతం సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. కథకు అనుగుణంగా నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికపై దర్శకుడు సుకుమార్ ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయట.
RC17 సినిమాకు సంబంధించి ప్రస్తుతం వినిపిస్తున్న ఆసక్తికరమైన వార్త ఏమిటంటే.. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను 2026 డిసెంబర్ చివరి వారంలో ప్రారంభించే అవకాశముందట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు ఊపందుకోవడంతో షూటింగ్ ప్రారంభానికి చిత్ర బృందం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.షూటింగ్ ప్రారంభమైతే సినిమా కథ, నటీనటులు, రామ్‌చరణ్ లుక్, ఇతర కీలక అంశాలపై వరుస అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది. దీంతో మెగా అభిమానులు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు. అయితే RC17లో సుకుమార్ ఎలాంటి కథను ఎంచుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈసారి చరణ్‌ను పూర్తిగా భిన్నమైన పాత్రలో చూపించబోతున్నారా? ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్‌లో ఎలాంటి మార్పులు ఉండబోతున్నాయి? రంగస్థలం తరహాలో మరో ప్రయోగాత్మక కథతో ప్రేక్షకుల ముందుకు వస్తారా? అనే ప్రశ్నలు అభిమానుల్లో వినిపిస్తున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ram Charan | RC17 షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. డిసెంబర్ చివరి వారంలో రామ్‌చరణ్-సుకుమార్ మూవీ పట్టాలెక్కే ఛాన్స్!
KTR | తెలంగాణ ప్రజల సమస్యలపై మౌనంగా ఉండి.. ఇప్పుడు రూ.100 కోట్లతో ప్రచార ఆర్భాటమా?: రాహుల్ గాంధీపై కేటీఆర్ ఫైర్
Pakistan: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో లోయలో పడిన వాహనం.. 11 మంది మృతి
డీలర్ షాపు కేటాయింపులో డబ్బుల వసూళ్లు.. అలంపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అక్రమాలపై చర్చ!
Ramayana | 8 రోజుల్లోనే రూ.1,033 కోట్లు.. ‘రామాయణం’ బాక్సాఫీస్ విధ్వంసం, అయినా ఆ రెండు సినిమాల తర్వాతే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

