Pakistan: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో లోయలో పడిన వాహనం.. 11 మంది మృతి
Pakistan Occupied Kashmir: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో ఓ వాహనం లోయలో పడింది. పర్వత ప్రాంతాల్లోని రోడ్డు మీద నుంచి ఆ వాహనం జారి లోయలో పడడంతో సుమారు 11 మంది మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు అధికారులు చెప్పారు.
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో ఓ వాహనం లోయలో పడింది. పర్వత ప్రాంతాల్లోని రోడ్డు మీద నుంచి ఆ వాహనం జారి లోయలో పడడంతో సుమారు 11 మంది మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు అధికారులు చెప్పారు. డ్రైవర్ అదుపు తప్పడంతో ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. శుక్రవారం ఉదయం కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 11 మృతదేహాలతో పాటు గాయపడ్డ ప్రయాణికులను సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పట్ల స్థానిక మంత్రి అంజద్ హుస్సేన్ సంతాపం తెలిపారు. గాయపడ్డవారికి ఉత్తమ వైద్యం అందించాలని ఆదేశించారు. ఆక్రమిత్ కశ్మీర్ రోడ్డు రవాణా వ్యవస్థ మరీ దుర్భరంగా ఉంది. చట్టాల అమలు సరిగా ఉండదు, డ్రైవింగ్ పద్ధతులు కూడా అదుపులో ఉండవు. గత వారం తూర్పు పాకిస్థాన్‌లో బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 11 మంది మృతిచెందగా, 33 మంది గాయపడ్డారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో లోయలో పడిన వాహనం.. 11 మంది మృతి
డీలర్ షాపు కేటాయింపులో డబ్బుల వసూళ్లు.. అలంపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అక్రమాలపై చర్చ!
Ramayana | 8 రోజుల్లోనే రూ.1,033 కోట్లు.. ‘రామాయణం’ బాక్సాఫీస్ విధ్వంసం, అయినా ఆ రెండు సినిమాల తర్వాతే!
IND vs NZ | సెంచరీతో చెలరేగిన విల్ యంగ్.. భారీ స్కోరు దిశగా న్యూజిలాండ్
Rajasthan: రాజస్థాన్‌లో 3 రకాల ఓటర్ల జాబితాలు.. సర్‌తో పోలిస్తే ఎస్‌ఎస్‌ఆర్‌లో 11 లక్షల మంది అధిక ఓటర్లు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

