Rajasthan: రాజస్థాన్‌లో 3 రకాల ఓటర్ల జాబితాలు.. సర్‌తో పోలిస్తే ఎస్‌ఎస్‌ఆర్‌లో 11 లక్షల మంది అధిక ఓటర్లు
Rajasthan: రాజస్థాన్‌లో ప్రస్తుతం మూడు రకాల ఓటర్ల జాబితా తయారైంది. తాజాగా స్పెషల్ సమ్మరీ రివిజన్ కింద గురువారం కొత్త ఓటర్ల జాబితాను ప్రచురించారు. ఎస్ఎస్ఆర్, సర్, రాష్ట్ర ఈసీ జాబితాల్లో..ఓటర్ల సంఖ్యలో భారీ తేడా ఉన్నది.
జైపూర్: రాజస్థాన్(Rajasthan)లో మూడు రకాల ఓటర్ల జాబితా తయారైంది. దీంతో అధికారులు తికమకపడుతున్నారు. తాజాగా 2027 స్పెషల్ సమ్మరీ రివిజన్ కింద గురువారం కొత్త ఓటర్ల జాబితాను ప్రచురించారు. ఆ జాబితా ప్రకారం రాజస్థాన్‌లో ఓటర్ల సంఖ్య 5.26 కోట్లుగా నమోదు అయ్యింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో ఆ రాష్ట్రంలో 5.15 కోట్ల ఓటర్లు ఉన్నట్లు నమోదు అయ్యింది. ఈ రెండు రకాల ఓటర్ల జాబితా మాత్రమే కాదు.. రాజస్థాన్‌లో మూడో ఓటరు లిస్టు కూడా ఉన్నది. ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఎన్నికల జాబితాలో 5.45 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఆ జాబితాను అక్టోబర్‌లో రిలీజ్ చేశారు.
అయితే రాజస్థాన్‌లో మూడు రకాల ఓటర్ల జాబితా ఉండడం, ఆ మూడింటి మధ్య ఓటర్ల సంఖ్యలో తేడా ఉండడం .. అధికారులను కన్ఫ్యూజ్ చేస్తోంది. కేవలం ఏడాది వ్యవధిలోనే మూడు రకాల ఓటర్ల జాబితాను రాజస్థాన్‌లో తయారుకావడం గమనార్హం. ఎస్ఐఆర్ ప్రకారం 5.15 కోట్లు, ఎస్ఈసీ ప్రకారం 5.45 కోట్లు, ఎస్ఎస్ఆర్ డ్రాఫ్ట్‌లో 5.26 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. మూడు జాబితాల్లో వ్యత్యాసం భారీగా ఉండంతో.. ఆ తేడా ఎందుకు వచ్చిందన్న ఆందోళనలో అధికారులు ఉన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajasthan: రాజస్థాన్‌లో 3 రకాల ఓటర్ల జాబితాలు.. సర్‌తో పోలిస్తే ఎస్‌ఎస్‌ఆర్‌లో 11 లక్షల మంది అధిక ఓటర్లు
Bala Krishna | తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ బాలయ్య పాట.. ‘దాదా ధమాకా’తో మాస్ జాతరకు సిద్ధం, రిలీజ్ టైమ్ ఫిక్స్!
Hyderabad | డిసెంబర్ వరకే హైదరాబాద్‌కు నీళ్లు.. ఆ తర్వాత తీవ్ర కొరత తప్పదా?
Microsoft: మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో అంతరాయం.. 5 గంటలు స్తంభించిన వివిధ అప్లికేషన్లు
Tejaswini | హీరోయిన్గా కాదు,నిర్మాతగా ఎంట్రీకి తేజస్విని రెడీ.. బాలయ్య కుమార్తె కొత్త ప్లాన్ ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

