డీలర్ షాపు కేటాయింపులో డబ్బుల వసూళ్లు.. అలంపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అక్రమాలపై చర్చ!
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ పరిధిలో రేషన్ డీలర్ షాపు కేటాయింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. మనోపాడు మండలంలోని డీలర్ షాప్ కేటాయింపులో డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారంటూ అలంపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పచ్చర్లకుమార్పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ పరిధిలో రేషన్ డీలర్ షాపు కేటాయింపు వ్యవహారం వివాదాస్పదంగా మారింది. మనోపాడు మండలంలోని డీలర్ షాప్ కేటాయింపులో డబ్బుల వసూళ్లకు పాల్పడ్డారంటూ అలంపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పచ్చర్లకుమార్పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ అండదండలు, అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మద్దతు తనకు ఉందనే ధీమాతోనే ఆయన ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారనే ప్రచారం స్థానికంగా చర్చనీయాంశమైంది.
డీలర్ షాపు కేటాయింపునకు సంబంధించి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత కూడా సదరు కేటాయింపును రద్దు చేసినట్లు సమాచారం. అనంతరం మనోపాడు మండల అధ్యక్షుడి ఆధ్వర్యంలో మరొకరికి షాపును కేటాయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల వెనుక పచ్చర్ల కుమార్ పాత్ర ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారంపై పచ్చర్ల కుమార్ మాట్లాడినట్లు ప్రచారంలో ఉన్న మాటలు మరింత చర్చకు దారితీశాయి. “నేను ఉన్నాను కదా! నీకేం భయం లేదు. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా ఉన్నారు” అంటూ పచ్చర్లకుమార్ భరోసా ఇచ్చినట్లు సమాచారం. అయితే డబ్బుల వసూళ్ల ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలు, ఆధారాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డీలర్ షాపు కేటాయింపులో డబ్బుల వసూళ్లు.. అలంపూర్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అక్రమాలపై చర్చ!
Ramayana | 8 రోజుల్లోనే రూ.1,033 కోట్లు.. ‘రామాయణం’ బాక్సాఫీస్ విధ్వంసం, అయినా ఆ రెండు సినిమాల తర్వాతే!
IND vs NZ | సెంచరీతో చెలరేగిన విల్ యంగ్.. భారీ స్కోరు దిశగా న్యూజిలాండ్
Rajasthan: రాజస్థాన్‌లో 3 రకాల ఓటర్ల జాబితాలు.. సర్‌తో పోలిస్తే ఎస్‌ఎస్‌ఆర్‌లో 11 లక్షల మంది అధిక ఓటర్లు
Bala Krishna | తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ బాలయ్య పాట.. ‘దాదా ధమాకా’తో మాస్ జాతరకు సిద్ధం, రిలీజ్ టైమ్ ఫిక్స్!
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

