IND vs NZ | సెంచరీతో చెలరేగిన విల్ యంగ్.. భారీ స్కోరు దిశగా న్యూజిలాండ్
IND vs NZ | భారత్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో న్యూజిలాండ్ బ్యాటర్లు చెలరేగుతున్నారు. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, విల్ యంగ్ శుభారంభం అందించగా.. విల్ యంగ్ అజేయ సెంచరీతో కదం తొక్కాడు. 88 బంతుల్లోనే వంద పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
IND vs NZ | భారత్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో న్యూజిలాండ్ బ్యాటర్లు చెలరేగుతున్నారు. ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, విల్ యంగ్ శుభారంభం అందించగా.. విల్ యంగ్ అజేయ సెంచరీతో కదం తొక్కాడు. 88 బంతుల్లోనే వంద పరుగుల మైలురాయిని అందుకున్నాడు. భారత్‌పై వన్డేల్లో అతడికిది తొలి సెంచరీ కావడం విశేషం. మరోవైపు ఫిన్ అలెన్ కూడా దూకుడుగా ఆడి 41 పరుగులు చేశాడు. 32 ఓవర్లు ముగిసేసరికి న్యూజిలాండ్ నాలుగు వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది.
టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. కివీస్ ఓపెనర్లు టిమ్ సీఫర్ట్, విల్ యంగ్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు 85 పరుగులు జోడించారు. సీఫర్ట్ 48 బంతుల్లో 58 పరుగులు చేసి గర్నూర్ బ్రార్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత నిక్ కెల్లీ (4)ను అక్షర్ పటేల్ స్టంపౌట్ చేయగా.. డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ (8)ను ఔకిబ్ నబీ పెవిలియన్‌కు పంపించాడు. దీంతో 125 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్‌ను విల్ యంగ్ ఆదుకున్నాడు.
ఒకవైపు వికెట్లు పడుతున్నా యంగ్ తన సహజశైలిలో ఆడుతూ పరుగులు రాబట్టాడు. ఫిన్ అలెన్‌తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో అలెన్ 30 బంతుల్లో 41 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి.
అయితే యంగ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. 31వ ఓవర్లో 98 పరుగుల వద్దకు చేరుకున్న అతడు.. కుల్దీప్ యాదవ్ వేసిన 32వ ఓవర్లో సింగిల్ తీసి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 88 బంతుల్లో వంద పరుగులు సాధించాడు. అతడికి మైకేల్ బ్రేస్‌వెల్ (1*) తోడుగా క్రీజులో ఉన్నాడు. 32 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోరు 218/4గా ఉంది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ రెండు వికెట్లు, గర్నూర్ బ్రార్, ఔకిబ్ నబీ తలో వికెట్ తీశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | సెంచరీతో చెలరేగిన విల్ యంగ్.. భారీ స్కోరు దిశగా న్యూజిలాండ్
Rajasthan: రాజస్థాన్‌లో 3 రకాల ఓటర్ల జాబితాలు.. సర్‌తో పోలిస్తే ఎస్‌ఎస్‌ఆర్‌లో 11 లక్షల మంది అధిక ఓటర్లు
Bala Krishna | తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ బాలయ్య పాట.. ‘దాదా ధమాకా’తో మాస్ జాతరకు సిద్ధం, రిలీజ్ టైమ్ ఫిక్స్!
Hyderabad | డిసెంబర్ వరకే హైదరాబాద్‌కు నీళ్లు.. ఆ తర్వాత తీవ్ర కొరత తప్పదా?
Microsoft: మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో అంతరాయం.. 5 గంటలు స్తంభించిన వివిధ అప్లికేషన్లు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

