Ramayana | 8 రోజుల్లోనే రూ.1,033 కోట్లు.. ‘రామాయణం’ బాక్సాఫీస్ విధ్వంసం, అయినా ఆ రెండు సినిమాల తర్వాతే!
Ramayana | భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పాలనే లక్ష్యంతో తెరకెక్కిన బాలీవుడ్ మైథలాజికల్ ఎపిక్ మూవీ ‘రామాయణం’ (Ramayana) బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది.
Ramayana | భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పాలనే లక్ష్యంతో తెరకెక్కిన బాలీవుడ్ మైథలాజికల్ ఎపిక్ మూవీ ‘రామాయణం’ (Ramayana) బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పరచుకున్న ఈ చిత్రం, థియేటర్లలోకి వచ్చిన తర్వాత కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రోజురోజుకూ వసూళ్లలో దూసుకెళ్తూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కేవలం 8 రోజుల్లోనే రూ.1,033 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు తెలుస్తుంది. దీంతో వెయ్యి కోట్ల క్లబ్‌లోకి అత్యంత వేగంగా చేరిన భారతీయ చిత్రాల జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకుంది.
‘రామాయణం’ సినిమా కేవలం ఎనిమిది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,033 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించడం విశేషం. అయితే అత్యంత వేగంగా రూ.1,000 కోట్ల మార్కును అందుకున్న భారతీయ సినిమాల జాబితాలో మాత్రం ఈ చిత్రం మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’, రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ సినిమాలు కేవలం ఏడు రోజుల్లోనే ఈ మైలురాయిని చేరుకుని మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. ఈ రెండు చిత్రాలతో పోలిస్తే ‘రామాయణం’ ఒక రోజు ఆలస్యంగా వెయ్యి కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టింది. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ‘పుష్ప 2’, ‘ధురంధర్ 2’ సినిమాలు రెండూ సీక్వెల్స్ కావడం. వాటి మొదటి భాగాల విజయంతో రెండో భాగాలపై విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అభిమానుల్లో ఉన్న క్రేజ్, ప్రచారం ఈ సినిమాలకు బాగా కలిసొచ్చాయి. కానీ ‘రామాయణం’ పరిస్థితి మాత్రం కొంత భిన్నంగా ఉంది.
విడుదలకు ముందు ఈ సినిమాపై మిశ్రమ స్పందనలు, భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా విజువల్స్, పాత్రల రూపకల్పన, కథనంపై సోషల్ మీడియాలో చర్చ జరిగింది. అయితే సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన తర్వాత పరిస్థితి మారిపోయింది. ప్రేక్షకుల ఆదరణతో వసూళ్లు అనూహ్యంగా పెరిగాయి. కేవలం ఎనిమిది రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్కును దాటడం ఈ చిత్రానికి ఉన్న క్రేజ్‌ను తెలియజేస్తోంది.ఈ భారీ పౌరాణిక చిత్రంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో నటిస్తున్నారు. సీతాదేవిగా టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన సాయిపల్లవి కనిపిస్తున్నారు. ఇక రావణుడి పాత్రలో కన్నడ స్టార్ యశ్ నటించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. విశేషమేమిటంటే యశ్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. నమిత్ మల్హోత్రాతో కలిసి ఆయన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | 8 రోజుల్లోనే రూ.1,033 కోట్లు.. ‘రామాయణం’ బాక్సాఫీస్ విధ్వంసం, అయినా ఆ రెండు సినిమాల తర్వాతే!
IND vs NZ | సెంచరీతో చెలరేగిన విల్ యంగ్.. భారీ స్కోరు దిశగా న్యూజిలాండ్
Rajasthan: రాజస్థాన్‌లో 3 రకాల ఓటర్ల జాబితాలు.. సర్‌తో పోలిస్తే ఎస్‌ఎస్‌ఆర్‌లో 11 లక్షల మంది అధిక ఓటర్లు
Bala Krishna | తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ బాలయ్య పాట.. ‘దాదా ధమాకా’తో మాస్ జాతరకు సిద్ధం, రిలీజ్ టైమ్ ఫిక్స్!
Hyderabad | డిసెంబర్ వరకే హైదరాబాద్‌కు నీళ్లు.. ఆ తర్వాత తీవ్ర కొరత తప్పదా?
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

