Bala Krishna | తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ బాలయ్య పాట.. ‘దాదా ధమాకా’తో మాస్ జాతరకు సిద్ధం, రిలీజ్ టైమ్ ఫిక్స్!
Bala Krishna | నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానులకు ఈరోజు (నవంబర్ 13) పండగలాంటి రోజు. వెండితెరపై తనదైన మాస్ డైలాగ్స్, పవర్ఫుల్ యాక్షన్‌తో ప్రేక్షకులను అలరించే బాలయ్య, ఇప్పుడు తన తాజా చిత్రం ‘దాదా’ (Dada)తో మరోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా నుంచి విడుదల కాబోతున్న ఫస్ట్ సింగిల్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Bala Krishna | నందమూరి నటసింహం బాలకృష్ణ అభిమానులకు ఈరోజు (నవంబర్ 13) పండగలాంటి రోజు. వెండితెరపై తనదైన మాస్ డైలాగ్స్, పవర్ఫుల్ యాక్షన్‌తో ప్రేక్షకులను అలరించే బాలయ్య, ఇప్పుడు తన తాజా చిత్రం ‘దాదా’ (Dada)తో మరోసారి బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా నుంచి విడుదల కాబోతున్న ఫస్ట్ సింగిల్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘దాదా ధమాకా’ పేరుతో రూపొందిన ఈ పాటను నేడు సాయంత్రం 4:48 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.ఈ పాటకు సంబంధించి అభిమానుల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న అంశం బాలకృష్ణ గాయకుడిగా మారడమే. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత ఆయన మరోసారి తన గొంతును సవరించుకుని పాట పాడినట్లు తెలుస్తోంది.
‘దాదా ధమాకా’లోని కొన్ని కీలక పంక్తులను బాలయ్య స్వయంగా ఆలపించారట. గతంలో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘పైసా వసూల్’ సినిమాలో ‘మామ ఏక్ పెగ్ లా’ పాటతో బాలయ్య చేసిన సందడి అంతా ఇంతా కాదు. ఆ పాట అప్పట్లో అభిమానులను థియేటర్లలో ఉర్రూతలూగించింది. ఇప్పుడు మరోసారి ఆయన గొంతు వినిపించనుండటంతో నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలకృష్ణ సినిమాలకు ఎస్. థమన్ అందించే సంగీతం, నేపథ్య సంగీతం ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘అఖండ’, ‘వీరసింహారెడ్డి’, ‘భగవంత్ కేసరి’, ‘డాకు మహారాజ్’ వంటి సినిమాలతో ఈ కాంబినేషన్ ప్రేక్షకులకు అదిరిపోయే మ్యూజికల్ ట్రీట్స్ అందించింది. ఇప్పుడు ‘దాదా’ కోసం మరోసారి బాలయ్య, థమన్ చేతులు కలపడంతో అంచనాలు మరింత పెరిగాయి.
ఇక ‘దాదా ధమాకా’ పాటలో బాలీవుడ్ అందాల తార నర్గీస్ ఫక్రీ బాలకృష్ణతో కలిసి స్టెప్పులు వేయనున్నారు. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ పాటకు మాస్ స్టెప్పులు కంపోజ్ చేసినట్లు సమాచారం. థమన్ అందించిన పవర్ఫుల్ బీట్స్‌కు బాలయ్య ఎనర్జీ, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ తోడైతే అభిమానులకు పక్కా మాస్ ట్రీట్ ఖాయమనే అంచనాలు ఉన్నాయి. ‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ‘దాదా’పై మొదటి నుంచే భారీ క్రేజ్ నెలకొంది. వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్నారు. అంతేకాకుండా మంచు మనోజ్, బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, సముద్రఖని, శరత్ కుమార్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ‘దాదా’ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krishna | తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ బాలయ్య పాట.. ‘దాదా ధమాకా’తో మాస్ జాతరకు సిద్ధం, రిలీజ్ టైమ్ ఫిక్స్!
Hyderabad | డిసెంబర్ వరకే హైదరాబాద్‌కు నీళ్లు.. ఆ తర్వాత తీవ్ర కొరత తప్పదా?
Microsoft: మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో అంతరాయం.. 5 గంటలు స్తంభించిన వివిధ అప్లికేషన్లు
Tejaswini | హీరోయిన్గా కాదు,నిర్మాతగా ఎంట్రీకి తేజస్విని రెడీ.. బాలయ్య కుమార్తె కొత్త ప్లాన్ ఇదే!
IND vs NZ | కివీస్ జోరుకు భారత బౌలర్ల బ్రేకులు.. 20 ఓవర్లలో మూడు వికెట్లు డౌన్
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

