హాస్యనటుడు సత్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘వివాహ భోజనంబు’. రామ్ అబ్బరాజు దర్శకుడు. సందీప్‌కిషన్, కె.ఎస్. శినీష్ నిర్మిస్తున్నారు. ఆర్జావీరాజ్ కథానాయిక. ఈ చిత్రంలోని ‘వాట్ ఏ మ్యాన్’ అనే గీతాన్ని చిత్రబృందం ఇటీవల విడుదలచేసింది. అనిరుద్ విజయ్ స్వరకర్త. చౌరస్తా రామ్ ఆలపించగా సామ్రాట్ సాహిత్యాన్ని అందించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘లాక్డౌన్ టైమ్‌లో పెళ్లిచేసుకున్న మహేష్ అనే పిసినారి యువకుడికి ఎదురయ్యే కష్టాలతో సరదాగా సినిమా సాగుతుంది’ అని తెలిపారు.
మరిన్ని వార్తలు చదవండి..