అందరూ గర్వపడే సినిమా ఇది

‘బాలీవుడ్ చిత్రం ‘ఉరి’కి జాతీయ అవార్డులు వచ్చినప్పుడు కమర్షియల్ పంథాలో పడి మనం అలాంటి సినిమాలు ఎందుకు చేయలేకపోతున్నామనే భావన నాలో కలిగింది. తెలుగు వాళ్లు అలాంటి కథల్ని అత్యద్భుతంగా తీయగలరని నాగార్జున ఈ సినిమా ద్వారా నిరూపించారు. అంతర్జాతీయ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలున్నాయి. దేశభక్తిని ప్రబోధించిన సినిమా ఇది’ అని అన్నారు అగ్ర కథానాయకుడు చిరంజీవి.
సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ‘వైల్డ్‌డాగ్’ చిత్రబృందాన్ని అభినందించారు. నాగార్జున హీరోగా అహిషోర్ సాల్మన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇటీవలే విడుదలైంది. చిరంజీవి మాట్లాడుతూ ‘సినిమా చూశాను. అందరూ గర్వపడే గొప్ప సినిమా అనిపించింది. పాటలు, కామెడీ, రొమాన్స్ లాంటి వాణిజ్య హంగులు లేకుండా వాస్తవిక కథతో సినిమా తీసి రెండున్నర గంటల పాటు ప్రేక్షకుల్ని థియేటర్లో కూర్చోబెట్టడం చాలా కష్టం.
నన్ను గగుర్పాటుకు లోనుచేసి ఆద్యంతం ఉత్కంఠను పంచింది. సీట్ఏడ్జ్లో కూర్చొని చూశా. పతాక ఘట్టాల్లో నాగార్జున నటన చూసి చప్పట్లు కొట్టడమే కాకుండా జైహింద్ అని నినదించాను. ఇలాంటి కథలు, పాత్రలు ఎన్నుకుంటూ నాగార్జున సినిమాలు చేయడం గర్వకారణంగా అనిపిస్తోంది’ అన్నారు. నాగార్జున మాట్లాడుతూ ‘ఈ సినిమాపై చిరంజీవి ప్రశంసలు అంతులేని ఆనం దాన్నిచ్చాయి. ఆదివారం రాత్రి సినిమా చూసి చిరంజీవి ఫోన్ చేశారు. ప్రతి భారతీయుడు చూడాల్సిన గొప్ప సినిమా ఇదని అభినందించారు’ అని చెప్పారు.
‘కరోనా క్రైసిస్ ఛారిటీ ద్వారా సేకరించిన ఫంఢ్స్లో కొంత మొత్తం మిగిలి ఉంది. ఆ డబ్బుతో సినీ కార్మికులతో పాటు వారి కుటుంబాలకు కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించాలని అనుకుంటు న్నాం’ అని చిరంజీవి తెలిపారు.
మరిన్ని వార్తలు చదవండి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Chiranjeevi
- Nagarjuna
- wild dog
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

