Omicron Third wave | ఫస్ట్ వేవ్.. సెకండ్ వేవ్ అంటూ ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్.. ఇప్పుడు ఒమిక్రాన్ రూపంలో విరుచుకుపడుతుంది. మరి ముఖ్యంగా గత వారం రోజులుగా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండటంతో థర్డ్ వేవ్ కూడా వచ్చేసిందేమోనన్న ఆందోళనలు మొదలయ్యాయి. ఇప్పటికే మొదటి రెండు వేవ్స్‌లో కరోనా సృష్టించిన అరాచకానికి వణికిపోయిన జనాలు.. థర్డ్ వేవ్ ఎలా ఉండబోతుందోనని బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో థర్డ్ వేవ్ వస్తే భారత్‌లో పరిస్థితి ఎలా ఉండబోతోంది ? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు అనేది ఓ సారి గమనిస్తే..
గత వారం రోజులుగా దేశంలోని పలు నగరాల్లో పెరుగుతున్న కరోనా కేసులు, ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని గమనిస్తుంటే.. థర్డ్ వేవ్ వచ్చిందనే సంకేతాలు వెల్లడవుతున్నాయని కొవిడ్ 19 వర్కింగ్ గ్రూప్ ఎన్‌టీఏజీ చీఫ్ డాక్టర్ ఎన్ కే అరోరా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బయటపడుతున్న కరోనా కేసుల్లో సగం వరకు ఒమిక్రాన్ వేరియంట్ కేసులే ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాదు ఒమిక్రాన్ విజృంభిస్తున్న చాలా దేశాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని చెప్పారు. అయితే కరోనా పెరుగుదల, థర్డ్ వేవ్‌పై అంతగా భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే 80 శాతం మంది ప్రజలు సహజంగానే వైరస్ బారిన పడ్డారు. 90 శాతం మంది కనీసం ఒక్క డోస్ వ్యాక్సిన్ అయినా తీసుకున్నారు. 65 శాతం మంది రెండు డోసులు తీసుకున్నారు. కాబట్టి కరోనా వైరస్ ప్రభావం మనపై అంతగా ఉండదని అభిప్రాయపడ్డారు.
ఒమిక్రాన్ బయటపడిన దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ వ్యాప్తి చాలా వేగంగా జరిగిందని ఎన్కే అరోరా గుర్తు చేశారు. అయితే రెండు వారాల్లోనే కొత్త కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని తెలిపారు. చాలా వరకు కేసుల్లో ఎలాంటి లక్షణాలు బయటపడలేదని.. కొన్ని కేసుల్లో మాత్రం స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయని చెప్పారు. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా తక్కువగానే ఉంది. వీటన్నింటినీ చూస్తుంటే దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేవ్ తొందరలోనే తగ్గిపోతుందని సంకేతాలు వెలువడుతున్నాయని చెప్పారు. ఈ కొత్త వేరియంట్ విషయంలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య చాలా పోలికలు కనిపిస్తున్నాయని ఎన్కే అరోరా పేర్కొన్నారు. అవేంటంటే.. ఇన్ఫెక్షన్ రేటు రెండు దేశాల్లోనూ చాలా ఎక్కువగా ఉంది. రోగ నిరోధక శక్తిలో అయితే దక్షిణాఫ్రికా కంటే భారత్ చాలా మెరుగ్గా ఉంది. గత వారం పదిరోజులుగా కొవిడ్ ఇన్ఫెక్షన్ తీరును గమనిస్తుంటే.. తొందరలోనే థర్డ్ వేవ్ చాలా పీక్‌కి చేరుకుంటుందని అంచనా వేశారు. అలా అని భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎందుకంటే దక్షిణాఫ్రికాలో మాదిరిగా తీవ్రస్థాయికి చేరుకుని రెండు వారాల్లో తగ్గిపోతుందని అంచనా వేశారు. కాకపోతే ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకుని వారు టీకా వేసుకోవాలని.. కొవిడ్-19 నిబంధనలను పాటించాలని సూచించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Corona New Variant |ప్రపంచానికి మరో ముప్పు.. ఒమిక్రాన్ కంటే డేంజర్ ఇది
ఒమిక్రాన్ వచ్చింది మన మంచికేనా?.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?
కరోనా గత వేరియంట్లతో ఊపిరి ఆడకపోయేది.. ఒమిక్రాన్‌లో ఈ లక్షణం ఎందుకు లేదు?
ఒమిక్రాన్‌తో కరోనా వైరస్ అంతం కాబోతుందా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
Omicron variant symptoms | గొంతులోనే వైరస్.. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలివే..
అమెరికాలో కరోనా సునామీ.. నిన్న ఒక్కరోజే 10 లక్షల కేసులు
Omicron Effect | కరోనా కేసుల పెరుగుదల థర్డ్ వేవ్‌కు సంకేతం : డాక్టర్ ఎన్కే అరోరా