Corona New Variant |ప్రపంచానికి మరో ముప్పు.. ఒమిక్రాన్ కంటే డేంజర్ ఇది
Covid-19 new Variant detected in France | ప్రపంచాన్ని కరోనా ఇంకా కలవరానికి గురి చేస్తూనే ఉన్నది. కొత్త కొత్తగా పుట్టుకువస్తున్న వేరియంట్లతో జనం ఆందోళనకు గురవుతున్నారు. గత నవంబర్ నెలాఖరులో దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే జనాన్ని

corona virus new variant | కరోనావైరస్ ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. ఎప్పటికప్పుడు రూపం మార్చుకుని విరుచుకుపడుతోంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ వేరియంట్ చాలా వేగంగా విస్తరిస్తున్నది. ఇంతకుముందు వచ్చిన వేరియంట్ల కంటే తొందరగా ప్రపంచ దేశాలకు వ్యాపిస్తుంది. అసలు ఒమిక్రాన్ ఎంత ప్రమాదకరమో తెలియక ప్రపంచ దేశాలు భయపడిపోతుంటే.. ఇప్పుడు దాని కంటే మరింత వేగంగా వ్యాపించే కొత్త వేరియంట్ బయటపడింది. యూరప్ దేశమైన ఫ్రాన్స్‌లో ఈ కొత్త వేరియంట్ కేసులు నమోదైనప్పటికీ.. వారంతా ఆఫ్రికన్ దేశమైన కామెరూన్ నుంచి రావడం ఇప్పుడు కలవరపెడుతున్నది.
దక్షిణ ఫ్రాన్స్‌లోని మార్సెయిల్స్‌లో ఇప్పటివరకు 12 కొత్త వేరియంట్ B.1.640.2 కేసులు రికార్డయ్యాయి. వీటిని B.1.640.2 ను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐహెచ్‌యూ మెడిటెర్రనీ ఇన్ఫెక్షన్ గుర్తించింది. ఈ వేరియంట్‌కు ప్రస్తుతానికి ఐహెచ్‌యూ అని నామకరణం చేశారు. కొత్త వేరియంట్ బాధితుల ట్రావెల్ హిస్టరీని పరిశీలించగా ఆఫ్రికన్ దేశమైన కామెరూన్ వెళ్లొచ్చినట్లు తెలిసింది. దీంతో ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు అప్రమత్తమయ్యారు. ఈ కొత్త వేరియంట్‌పై పరిశోధనలు జరుపగా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఒమిక్రాన్ వేరియంట్లో 30కి పైగా మ్యుటేషన్లు ఉండగా.. ఈ కొత్త వేరియంట్లో అంతకుమించి 46 వరకు ఉత్పరివర్తనాలు ఉన్నట్లు తెలిసింది. నిజానికి గత వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్‌లోనే అత్యధిక మ్యుటేషన్లు ఉన్నాయి. దీనివల్ల ఈ వేరియంట్ వ్యాప్తి రేటు చాలా ఎక్కువగా ఉంది. కానీ ఈ కొత్త వేరియంట్లో అంతకుమించి మ్యుటేషన్లు ఉండటంతో.. ఇది ఇంక ఎంత వేగంగా వ్యాపిస్తుందోనని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే, దీనిపై ఇంకా పరిశోధనలు జరుగాల్సిన ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం కొత్త వేరియంట్ ఇన్ఫెక్షన్ రేటు ఎక్కువగా లేదని ప్రైమరీ డేటా పేర్కొంది.
మరో వైపు కొత్త వేరియంట్ ఫ్రెంచ్ సరిహద్దుల నుంచి బ్రిటన్‌లోకి ప్రవేశించి ఉండొచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు వచ్చిన కరోనా అన్ని వేరియంట్ల B.1.640.2 భిన్నంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ వేరియంట్లో అసాధారణ కలయికలను గమనించారు. కొత్త వేరియంట్ అనేక జన్యు మార్పులను చూపుతోందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అయితే ఫ్రాన్స్ మినహా వేరే దేశంలో ఈ వేరియంట్‌ను ఇంకా గుర్తించలేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ కొత్త వేరియంట్‌పై ఇప్పటివరకు ఎటువంటి పరిశోధన ప్రారంభించలేదు. కానీ ఈ వేరియంట్ గురించి అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఎరిక్ ఫీగల్ డింగ్ కొన్ని ముఖ్యమైన విషయాలను ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
తరచూ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి.. అలా అని అవి ఇప్పటివరకు ఉన్న వాటికంటే మరింత ప్రమాదకరమైనవి కావాల్సిన అవసరం లేదని ఎరిక్ ఫీగల్ స్పష్టం చేశారు. ఎక్కువ మ్యుటేషన్లు ఉన్నంత మాత్రాన అది అంత ప్రమాదకరమైనది కావాలని ఏమీ లేదని వెల్లడించారు. కాకపోతే ఒమిక్రాన్ తరహాలోనే ఇది కూడా వేరియంట్ ఆఫ్ కన్సర్న్‌గా చెప్పొచ్చు. కానీ ఒమిక్రాన్ తరహాలో ఇది రోగ నిరోధక శక్తిని ఏమారుస్తుందా? లేదా? దీని ప్రభావం ఎలా ఉంటుందనేది మాత్రం ఇప్పుడే చెప్పలేమని అన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఒమిక్రాన్ వచ్చింది మన మంచికేనా?.. అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?
కరోనా గత వేరియంట్లతో ఊపిరి ఆడకపోయేది.. ఒమిక్రాన్‌లో ఈ లక్షణం ఎందుకు లేదు?
ఒమిక్రాన్‌తో కరోనా వైరస్ అంతం కాబోతుందా? శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
Omicron variant symptoms | గొంతులోనే వైరస్.. ఒమిక్రాన్ వేరియంట్ లక్షణాలివే..
అమెరికాలో కరోనా సునామీ.. నిన్న ఒక్కరోజే 10 లక్షల కేసులు
Omicron Effect | కరోనా కేసుల పెరుగుదల థర్డ్ వేవ్‌కు సంకేతం : డాక్టర్ ఎన్కే అరోరా
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

